Home తాజా వార్తలు ఆదర్శ్ స్కామ్ లో మాజీ ముఖ్యమంత్రికి ఊరట

ఆదర్శ్ స్కామ్ లో మాజీ ముఖ్యమంత్రికి ఊరట

Ashok-Chavan

ముంబయి: ఆదర్శ్ స్కామ్‌లో మాజీ ముఖ్యమంత్రి అశోక్ చవాన్‌కు ఊరట లభించింది. ఈ స్కామ్ పై గవర్నర్ ఉత్తర్వులను బాంబే హైకోర్టు కొట్టిపడేసింది. అశోక్ చవాన్‌ను ప్రశ్నించాలని గతంలో గవర్నర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఆదర్శ్ హౌసింగ్ సొసైటీ కుంభకోణంలో ఆశోక్ చవాన్ పాత్ర ఉన్నట్టు  ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ కుంభకోణంలో చవాన్‌తో పాటు మాజీ మేజర్ జనరల్ ఎంఎం.వాంకో, ఆర్.సి.ఠాకూర్, కన్నయ్య లాల్ గిద్వానీలు ప్రధాన కుట్రదారులుగా చేర్చుతూ ఎఫ్ఐఆర్ నమోదు చేసిన  విషయం విధితమే.