Search
Sunday 18 November 2018
  • :
  • :

వైసిపి ఎంపిల రాజీనామాలు అంత డ్రామా…

ashok
అమరావతి: రాజకీయాల్లో టిడిపి పాత్ర అనేసరికి స్వర్గీయ ”ఎన్ టిఆర్” గుర్తొస్తారని కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు అన్నారు. వైసిపి ఎంపిల రాజీనామాలు అంతా డ్రామా అని మంత్రి విమర్శలు గుప్పించారు. జాతీయ రాజకీయాల్లో టిడిపి పాత్రపై అశోక్ గజపతిరాజు  మహానాడులో తీర్మానం ప్రవేశ పెట్టారు. ఒక ఫెడరల్ స్ట్రక్చర్ కోసం ఎన్ టిఆర్ ఆహర్నిశలు కష్టపడ్డారని ఆయన కొనియాడారు. ఎన్ని ఒత్తిడిలు వచ్చినా తట్టుకున్నారని ఆయన పేర్కొన్నారు. ఆనాడు ఆయన ఒక్క పిలుపుతో 105 మంది ఎంపిలు రాజీనామా చేశారని గుర్తుచేశారు. ఇప్పుడు రాజీనామ చేసిన వైసిపి ఎంపిల రాజీనామాల్లో చిత్తశుద్ధి లేదని విమర్శించారు. పార్లమెంట్ సమావేశాలు ముగిసిన తక్షణమే రాజీనామాలు సమర్పించారని చెప్పారు. ఇంత వరకు ఎంపిల రాజీనామాలు ఆమోదించిన దాఖలాలు లేవని అశోక్ గజపతిరాజు స్పష్టం చేశారు.

Comments

comments