Home జాతీయ వార్తలు సిఎంగా గెహ్లాట్.. డిప్యూటీగా సచిన్

సిఎంగా గెహ్లాట్.. డిప్యూటీగా సచిన్

Ashok Gehlot Will Be Fourth Rajasthan Chief Minister

న్యూఢిల్లీ: రెండు రోజుల పాటు కొనసాగిన సస్పెన్స్‌కు తెరపడింది. రాజస్థాన్ ముఖ్యమంత్రిగా అశోక్ గెహ్లాట్, ఉప ముఖ్యమంత్రిగా సచిన్ పైలట్‌ను ఎంపిక చేస్తూ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సామరస్యపూర్వక పరిష్కారాన్ని కనుగొన్నారు. రాజస్థాన్ సిఎం రేసులో ఉన్న ఈ ఇద్దరు నాయకులు శుక్రవారం రాహుల్ గాంధీతో సుదీర్ఘంగా సమావేశమయ్యారు. పార్టీలో అసమ్మతి తలెత్తకుండా ఉభయులకూ సముచిత ప్రాధాన్యం కల్పిస్తూ రాహు ల్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. పార్టీ అధిష్టానం తీసుకున్న నిర్ణయాన్ని ఎఐసిసి పరిశీలకుడు కెసి వేణుగోపాల్ విలేకరుల సమావేశంలో వెల్లడించారు. గవర్నర్‌ను కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు సంసిద్ధతను వ్యక్తం చేస్తామని, ప్రమాణ స్వీకార కార్యక్రమం ఎప్పుడుంటుందనేదానిపై త్వ రలో నిర్ణయం చెబుతామని చెప్పారు.

రా హుల్ కూడా తన ట్విట్టర్‌లో ఆ ఇద్దరు నా యకులతో కలసి చిరునవ్వులు చిందిస్తూ తీసుకున్న ఫోటోను షేర్ చేశారు. మరోవైపు సిఎం పదవి రేసులో సీనియర్ నేత గెహ్లాట్‌కు ఈ సారి కూడా తీవ్ర పోటీ తప్పలేదు. 1998, 2008 సంవత్సరాల్లో కాంగ్రెస్ రాజస్థాన్‌లో అధికారంలోకి వచ్చినప్పుడు కూడా ముఖ్యమంత్రి పీఠమెక్కడంలో జాట్ నాయకులు శీశ్‌రాం ఓలా, మాజీ స్పీకర్ పారస్‌రామ్ మదెర్నాల నుంచి ఆయనకు ప్రతిఘటన ఎదురైంది. ఆ రెండు సమయాల్లోనూ తన ప్రతిభతో గట్టెక్కారు. ఈ సారి సచిన్ పైలట్ రూపంలో ఆ ఇబ్బంది ఎదురైంది. అయితే చివరకు ‘మాలి’ వర్గానికి చెందిన గెహ్లాట్ వైపే కాంగ్రెస్ అధిష్టానం మొగ్గుచూపింది. ప్రత్యేక యాప్ ద్వారా రాహుల్ రాజస్థాన్‌కు చెందిన కార్యకర్తలు, నాయకుల అభిప్రాయాలు సేకరించారు. పలువురితో సోనియా కూడా విస్తృతంగా చర్చలు జరిపారు.
చత్తీస్‌గఢ్ సిఎం రేసులో టిఎస్ దేవ్
మరోవైపు చత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి ఎవరనేదానిపై కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాం ధీ సీరియస్‌గా దృష్టి సారించారు. 4 ఆశావహులతో శుక్రవారంనాడిక్కడ భే టీ అయ్యా రు. వారిలో టిఎస్ సింగ్ దేవ్ ముందువరుసలో ఉన్నట్లు కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. ఆయనతో పాటు రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ భూపే ష్ భగేల్, చరణ్‌దాస్ మహంత, తమర్వాదాజ్ సాహు కూడా పోటీలో ఉన్నారు.

Ashok Gehlot Will Be Fourth Rajasthan Chief Minister