Home వార్తలు అశ్విన్‌కు కెరీర్ బెస్ట్ ర్యాంక్

అశ్విన్‌కు కెరీర్ బెస్ట్ ర్యాంక్

ashwinదుబాయి: గాంధీ-మం డేలా టెస్టు సిరీస్‌లో దక్షి ణాఫ్రికా బ్యాట్స్‌మెన్‌లను తన స్పిన్ మాయాజాలంతో బెంబేలెత్తించి మరో టెస్టు మిగిలిఉండగానే భారత్‌కు సిరీస్ అందించిన ఆఫ్‌స్పి న్నర్ రవిచంద్రన్ అశ్విన్ తా జాగా టెస్టు బౌలింగ్ ర్యాంకిం గ్స్‌లో కెరీర్ అత్యుత్తమ ర్యాంక్‌కు చేరుకున్నాడు. మొత్తం మూడుటెస్టుల్లో 24(ఐదు ఇన్నింగ్స్‌ల్లో) వికెట్లు తీసిన అశ్విన్ సోమవారం ఐసిసి విడుదల చేసిన బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో 856 పాయింట్లతో అశ్విన్ రెండోస్థానంలో నిలిచాడు. అశ్విన్ సహచరులు రవీంద్ర జడేజా, అమిత్‌మిశ్రా కూడా చెరో ర్యాంక్‌ను మెరుగుపర్చుకున్నారు. జడేజా 11వ స్థానంలో నిలవగా, మిశ్రాకు 31వ ర్యాంక్ దక్కింది. పేసర్ 20వ స్థానంలో మార్పు లేదు. కాగా గాయంతో భారత్‌తో టెస్టు సిరీస్‌కు దూరమైన స్టెయిన్ తన అగ్రస్థానాన్ని నిలుపుకున్నాడు. ఇక బ్యాట్స్‌మెన్ ర్యాంకింగ్స్‌లో మురళీవిజయ్ తన 12వ స్థానంలోనే నిలవగా, ఒక్కో స్థానం మెరుగుపర్చుకున్న కెప్టెన్ విరాట్ కోహ్లి 16వ స్థానంలోనూ, ఓపెనర్ శిఖర్‌ధావన్ 32వ స్థానంలోనూ నిలిచారు. ఇక సఫారీ బ్యాట్స్‌మన్ ఏబీ డివిల్లియర్స్ నెం.1 నుంచి మూడో స్థానానికి పడిపోయాడు. అగ్రస్థానంలో ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవెన్‌స్మిత్, ఇంగ్లండ్ మిడిలార్డర్ బ్యాట్స్‌మన్ జోయ్ రూట్ ఇద్దరూ 886 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచారు.