Search
Sunday 23 September 2018
  • :
  • :

అశ్వారావుపేటలో భారీ వర్షం

rainఅశ్వారావుపేట టౌన్: ఎంతో కాలంగా వర్షాల కోసం ఎదురుచూస్తున్న రైతన్నలకు ఆదివారం సాయంత్రం కురిసిన భారీ వర్షం ఉపశమనం కలిగిం చింది. ఏడు నెలలుగా వర్షాల కోసం రైతులు ఎదురు చూస్తున్నారు. ముఖ్యంగా ఈ ప్రాంతం ఉద్యానవన పంట లు కలిగిఉండటం, భూగర్భ జలాలు తగ్గడంతో అరటి పామాయిల్ , కొబ్బరి, ఖోఖో తదితర పంటలకు నీటి ఎద్ద డి ఏర్పడటంతో రైతులు వర్షం కోసం ఎంతో ఆశగా ఎదు రుచూస్తున్నారు. ఆదివారం సాయంత్రం పేటలో సుమా రు గంటన్నర పాటు భారీ వర్షం రావడంతో రైతులు ఆనందాన్ని వ్యక్తం చూస్తున్నారు. గత ఏడు నెలలుగా వర్షాలు లేకుండా ఉండటంతో పశువులకు సైతం నీటి కోసం ఇబ్బందులు పడుతున్నాయి. ఈ వర్షంతో ఎక్కడ చూసిన నీరు కనిపించింది. వ్యవసాయ పనులు చేపట్టేం దుకు ఈ వర్షం ఎంతగానో అవసర పడుతుందని విత్తనాలు నాటేందుకు దుక్కులు తయారు చేసుకునేం దుకు అనువుగా ఉంటుందని రైతులు ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు. గటన్నర పాటు కురిసిన వర్షంతో పట్టణంలోని రోడ్లు, డ్రైన్‌లు, లోతట్టు ప్రాంతాలు జలమ యమయ్యాయి. ఈ వర్షం మిషన్ కాకతీయ పనులకు ఇబ్బందిగా ఉంటుందని గుత్తేదారులు అంటు న్నారు. ఆదివారం దాదాపు 4సెం.మీ మేర వర్షపాతం నమోదు అయి ఉంటుందని అంచనా.
ఖమ్మంలో: గత కొంతకాలంగా వర్షాలు లేకుండా ఎండ వేడిమితో ఇబ్బందులు పడుతున్న ప్రజలకు వర్షం పడ టంతో కొంత ఊరటనిచ్చింది. వర్షం రాకతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. నగరంలో ఆదివారం ఉరు ములు, మెరుపులతో కూడిన వర్షం పడింది. వర్షాలు పడ టంతో రైతులు దుక్కులు దున్ని, విత్తనాలు విత్తేందుకు పొ లాలు దున్నేందుకు నాగళ్లు, ట్రాక్టర్లు, ఇతర యంత్రాలు సిద్ధం చేసుకుంటుంన్నారు.

Comments

comments