Home స్కోర్ మళ్లీ తిప్పాడు!

మళ్లీ తిప్పాడు!

నాలుగు వికెట్లతో ఆశ్విన్ మాయాజాలం – నాలుగో టెస్ట్ మొదటిరోజు ఇంగ్లాండ్ 288/5

Ashwinముంబయి: భారత్-ఇంగ్లాండ్ మధ్య వాంఖడే స్టేడి యం లో జరిగిన నాలుగో టెస్ట్‌లో టీమిండియా స్పిన్నర్ రవి చంద్రన్ ఆశ్విన్ మరోసారి ఆకట్టుకున్నాడు. పేస్‌కు అనుకూలి స్తుందనుకున్న పిచ్‌పై ఇంగ్లీష్ బ్యాట్స్‌మె న్‌ను ఇబ్బంది పెట్టాడు. తొలిరోజే నాలుగు వికెట్లు తీసి ప్రత్యర్థి జట్టులో వణుకు పుట్టించా డు. అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లీష్ జట్టు తొలిరోజు ఆట ముగిసే సమయానికి ఐదు వికెట్ల నష్టానికి 288 పరుగులు చేసింది. ఇంగ్లండ్ ఆటగాళ్లలో కీనట్ జెన్నింగ్స్ (112; 219 బంతుల్లో 13ఫోర్లు) శతకం సాధిం చగా, కెప్టెన్ అలెస్టర్ కుక్ (46) త్రుటిలో అర్ధ సెంచరీని కోల్పోయాడు. ఈ జోడి తొలి వికెట్‌కు 99 పరుగులు జోడించిన తరువాత కుక్ పెవిలియన్ చేరాడు. రవీంద్ర జడేజా బౌలింగ్‌లో ముందుకొచ్చి ఆడబోయిన కు క్‌ను పార్థీవ్ పటేల్ స్టంపింగ్ చేశాడు. దీంతో లంచ్‌కు ముందే ఇంగ్లండ్ వికెట్ ను కోల్పోయింది. ఆ తరువాత జెన్నింగ్స్ తో కలిసిన జో రూట్ ఇన్నింగ్స్ ను చక్కదిద్దే యత్నం చేశాడు. అయితే రూ ట్(21)ను అశ్విన్ అద్భుతమైన బంతి తో పెవిలియన్‌కు పంపడంతో ఇం గ్లాండ్ కష్టాల్లో పడినట్లు కనిపించిం ది. ఆ తరుణంలో జెన్నింగ్స్-మొ యిన్ అలీల జోడి భారత బౌలర్లకు దీటుగా సమాధా నమిస్తూ స్కోరు బోర్డు ను పరుగులు పె ట్టించింది. వీరిద్ద రూ మూడో వికె ట్‌కు 94 పరుగు లు జోడించారు. ఈ క్రమంలోనే అలీ (50) అర్ధ శతకం పూర్తి చేసుకు న్నాడు. ఈ క్రమంలో జట్టు స్కోరు 230 పరుగుల వద్ద ఉండగా అలీని మూడో వికెట్ రూపంలో అశ్విన్ పెవిలియ న్‌కు పంపాడు. ఆ వెంటనే జెన్నింగ్స్‌ను కూడా అశ్విన్ అవుట్ చేసి భారత్‌కు చక్కటి బ్రేక్ ఇచ్చాడు. అనంతరం మరో 19 పరుగుల వ్యవధిలోనే బెయిర్ స్టో(14)కూడా అశ్విన్‌కు చిక్కడంతో భారత్ పట్టు సాధించినట్లు కనబడింది. అయితే ఆ తరువాత బెన్ స్టోక్స్ (25 బ్యాటింగ్), బట్లర్(18 బ్యాటింగ్) మరో వికెట్ పడకుండా జాగ్రత్త పడ్డారు. దీంతో తొలిరోజు ఇరుజట్లు తమ ఆధిపత్యాన్ని ప్రదర్శించినట్లయింది.
ఆరంగేట్ర మ్యాచ్‌లోనే సెంచరీ..
మూడో టెస్ట్‌లో గాయపడిన హసీబ్ స్థానంలో జట్టులోకి వచ్చిన యువ ఓపెనర్ కేటాన్ జెన్నింగ్స్ (112; 219 బంతుల్లో 13×4) శతకంతో అదరగొట్టాడు. దీంతో 2010 తర్వాత భారత్‌పై అరంగేట్రం టెస్టులో సెంచరీ చేసిన ఐదో బ్యాట్స్‌మన్‌గా రికార్డు నెలకొల్పాడు. కెప్టెన్ అలిస్టర్ కుక్ (46; 60 బంతుల్లో 5×4)తో కలిసి తొలి వికెట్‌కు 99 పరుగుల భాగస్వామ్యం అందించాడు. వన్‌డౌన్‌లో వచ్చిన జోరూట్ (21; 41 బంతుల్లో 1×4) స్వల్ప పరుగులకే అవుట్ అయినా మొయి న్‌అలీ (50; 104 బంతుల్లో 4×4, 1×6)తో కలిసి 3వ వికెట్‌కు 94 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. శతకం తర్వాత దూకుడుగా ఆడేందు కు ప్రయత్నించిన జెన్నింగ్స్‌ను అశ్వినే అవుట్ చేశాడు.
సొంత ఆటగాడు లేకుండానే..
ముంబయిలోని వాంఖడే మైదానానికి ఎంతో చరిత్ర ఉంది. 1974-75 మధ్య భారత్-వెస్టిండీస్ మధ్య ఈ మైదానంలో మొదటి టెస్టు మ్యాచ్ జరిగింది. అప్పటి నుంచి ఈ మైదానంలో టెస్ట్ మ్యాచ్ అంటే భారత జట్టులో ముంబయికి చెందిన ఆటగాడు కనీసం ఒక్కరైనా ఉండేవారు. అయితే తొలిసారి ఆ ఘనత కోల్పోయింది ముంబయి. 2013లో వాంఖడేలో చివరి టెస్టు ఆడిన మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ రిటైర్మెంట్ ప్రకటింన తర్వాత ఈ మైదానంలో ఇప్పటివరకు టెస్ట్‌మ్యాచ్ నిర్వహించలేదు. ఇంగ్లాండ్‌తో ఐదు టెస్ట్‌మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా వాంఖడే మైదానంలో గురువారం ప్రారంభమైన నాలుగో టెస్ట్‌లో ఒక్క ముంబయి ఆటగాడు లేకుండానే భారత్ బరిలోకి దిగింది. అయితే నెట్స్‌లో కుడిచేతి చూపుడు వేలికి గాయం కావడంతో రహానే మిగిలిన రెండు టెస్టులకు దూరమైన విషయం తెలిసిందే.