Search
Monday 24 September 2018
  • :
  • :

మహిళా హోంగార్డుతో ఎఎస్ఐ మసాజ్‌…!(వీడియో)

Woman-Homeguard-Massage-to-

హైదరాబాద్: పోలీసు శాఖను ఆర్డర్లీ జాడ్యం ఇంకా వదలడం లేదు. పోలీసు అధికారులు తమ కిందిస్థాయి ఉద్యోగితో చాకిరీ చేయించుకుంటున్న ఉదంతాలు తరచూ వెలుగు చూస్తూనే ఉన్నాయి. ఇటీవలే హోంగార్డుతో సరూర్‌నగర్ సిఐ లింగయ్య మాసాజ్ చేయించుకున్న ఘటనను మరువకుముందే తాజాగా జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో ఇదే కొవలోనే మరో ఘటన వెలుగులోకి వచ్చింది. జిల్లా సాయుధ రిజర్వు పోలీసు కార్యాలయంలో ఎఎస్ఐగా విధులు నిర్వహిస్తున్న హసన్ తనతో పాటు పనిచేస్తున్న ఓ మహిళా హోంగార్డుతో మసాజ్‌ చేయించుకుంటున్న దృశ్యాలు బయటకు వచ్చాయి. దీంతో ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ASI gets Massage with Woman Homegaurd in Gadwal.

Comments

comments