Home కామారెడ్డి గుండెపోటుతో ఎఎస్సై మురళి హఠాన్మరణం

గుండెపోటుతో ఎఎస్సై మురళి హఠాన్మరణం

 

మన తెలంగాణ/ఎల్లారెడ్డి: కామారెడ్డి జిల్లా  ఎల్లారెడ్డి పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న పి.వి. మురళి కృష్ణరాజు (55) శుక్రవారం తెల్లవారుజామున గుండెపోటుతో మృతి చెందాడు. సిఐ సుదాకర్ కథనం ప్రకారం …. ఈ నెల 12న స్థానిక పోలీస్ స్టేషన్‌లో విధుల్లో చేరిన మురళి కృష్ణరాజు 13న కోర్టు పనిపై హైదరాబాద్ హైకోర్టుకు వెళ్ళాడు. గురువారం ఉదయం పోలీస్ స్టేషన్‌కు వచ్చి విధులకు హాజరయ్యారని తెలిపారు. సాయంత్రం వరకు పోలీస్ స్టేషన్‌లో విధులు చేపట్టిన రాజు రాత్రి భోజనం చేసిన అనంతరం స్టేషన్ పై వున్న బ్యారక్‌లో నిద్ర పోయారని చెప్పారు.

శుక్రవారం తెల్లవారుజామున గుండెపోటు రావడంతో ఎస్సై మృతి చెంది వుంటారని సిఐ పేర్కొన్నారు. ఎఎస్సైకి గుండెపోటు వుందని, మళ్ళీ అదే రావడంతో మృతి చెందివుండొచ్చన్నారు. ఆయన బంధువులు, భార్య, సోదరులు శుక్రవారం ఉదయం రావడంతో వారి అంగీకారం మేరకు మృతదేహాన్ని వారికి అప్పగించామని చెప్పారు. పోలీస్‌శాఖ అంబులెన్స్‌లో అతని స్వగృహం మేడ్చల్‌కు పంపినట్లు వివరించారు. జిల్లాలోని రాజంపేట్ పోలీస్ స్టేషన్‌లో పని చేస్తున్న మురళీ కృష్ణ రాజు ఇటీవల పదోన్నతిపై ఎఎస్సైగా విధుల్లో చేరారని ఆయన పేర్కొన్నారు. ఎఎస్సై మృతదేహానికి సిఐ సుధాకర్, ఎస్సై ఉపేందర్ రెడ్డిలు పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం పోలీసుల సంఘం జిల్లా అధ్యక్షుడు షకీల్ ఎఎస్సై మృతి పట్ల సంతాపం ప్రకటించారు. సంఘం తరపున అంత్యక్రియల కోసం 20 వేల నగదును సిఐ చేతుల మీదుగా అందజేశారు.

Telangana news

 

ASI Murali Dead with Heart Attack in Kamareddy