Search
Thursday 20 September 2018
  • :
  • :
Latest News

ఆసియా కప్ 2018

Asia-cup2018
సెప్టెంబర్ 19న పాక్‌తో తలపడనున్న టీమిండియా
అబుధాబి(యుఎఇ): ఆసియా కప్ 2018లో సెప్టెంబర్ 19న డిఫెండింగ్ ఛాంపియన్ టీమిండియా గ్రూప్ దశలో పాకిస్థాన్‌తో తలపడనున్నది. ఈ విషయాన్ని అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసిసి) మంగళవారం ప్రకటించింది. భారత్ తన క్వాలిఫయర్ మ్యాచ్‌ను సెప్టెంబర్ 18న ఆరంభించినుంది. గ్రూప్‌ఎలో భారత్, పాకిస్థాన్ జట్లు ఉన్నా యి. కాగా గ్రూప్‌బిలో శ్రీలంక, బంగ్లాదేశ్, అఫ్ఘానిస్థాన్ జట్లు ఉన్నా యి. ప్రతి గ్రూపు నుంచి రెండు జట్లు సూపర్4కు క్వాలిఫై అవుతా యి. కాగా దుబాయ్‌లో సెప్టెంబర్ 28న రెండు టీమ్‌లు ఫైనల్ ఆడతా యి. ఈ దై ్వవార్షిక టోర్నమెంట్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో సె ప్టెంబర్ 15 నుంచి ఆరంభం కానుంది. ఓపెనింగ్ మ్యాచ్ దుబాయ్ లో శ్రీలంక, బంగ్లాదేశ్‌ల మధ్య జరగనుంది. ఈ టోర్నమెంట్‌లో ఆడే జట్లుగా భారత్, పాకిస్థాన్, శ్రీలంక, బంగ్లాదేశ్, అఫ్ఘానిస్థాన్ నిర్ధారణ అయ్యాయి. కాగా యుఎఇ, సింగపూర్, ఓమన్, నేపాల్, మలేషియా, హాంకాంగ్ జట్లు ఖరారు కావలసి ఉంది. ప్రస్తుతానికి ప్రకటించిన ఆసియా కప్ 2018 షెడ్యూల్..

ఆసియా కప్ 2018 షెడ్యూల్

తేదీ                            జట్లు                                       వేదిక

                                గ్రూప్ దశ

సెప్టెంబర్ 15     బంగ్లాదేశ్ X శ్రీలంక                           దుబాయ్
సెప్టెంబర్ 16    పాకిస్థాన్ X క్వాలిఫయర్                    దుబాయ్
సెప్టెంబర్ 17     శ్రీలంక X అఫ్ఘానిస్థాన్                         అబుధాబి
సెప్టెంబర్ 18     భారత్ X క్వాలిఫయర్                       దుబాయ్
సెప్టెంబర్ 19    భారత్ X పాకిస్థాన్                             దుబాయ్
సెప్టెంబర్ 20    బంగ్లాదేశ్ X అఫ్ఘానిస్థాన్                     అబుధాబి

                            సూపర్ 4

సెప్టెంబర్ 21     గ్రూప్-ఎ విజేత X గ్రూప్-బి రన్నరప్     దుబాయ్
సెప్టెంబర్ 21     గ్రూప్-బి విజేత X గ్రూప్-ఎ రన్నరప్      అబుధాబి
సెప్టెంబర్ 23     గ్రూప్-ఎ విజేత X గ్రూప్-ఎ రన్నరప్       దుబాయ్
సెప్టెంబర్ 23     గ్రూప్-బి విజేత X గ్రూప్-బి రన్నరప్      అబుధాబి
సెప్టెంబర్ 25      గ్రూప్-ఎ విజేత X గ్రూప్-బి విజేత         దుబాయ్
సెప్టెంబర్ 26    గ్రూప్-ఎ రన్నరప్ X గ్రూప్-బి రన్నరప్   అబుధాబి
సెప్టెంబర్ 28 ఫైనల్ మ్యాచ్ దుబాయ్

Comments

comments