Search
Saturday 17 November 2018
  • :
  • :
Latest News

ఆసియాకప్ టి20 టైటిల్ బంగ్లాదేశ్ కైవసం

bangla-womens

కౌలాలంపూర్: ఆసియాకప్ మహిళల టి20 టైటిల్‌ను బంగ్లాదేశ్ కైవసం చేసుకుంది. ఆదివారం భారత్‌తో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో 3 వికెట్ల తేడాతో గెలిచి చరిత్ర సృష్టించింది. చివరి వరకు ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్‌లో బంగ్లాదేశ్ చివరి బంతికి గెలుపొంది, వరుసగా ఆరుసార్లు టైటిళ్లను గెలిచిన భారత్‌కు షాక్ ఇచ్చింది. టాస్ ఓడి ముందు బ్యాటింగ్‌కు దిగిన భారత మహిళల జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 112 పరుగులు చేసింది. కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్(56) మాత్రమే రాణించింది. స్మృతి మంధాన(7), మిథాలీ రాజ్(11), వేదా కృష్ణయూర్తి(11), దీప్తి శర్మ(4)తో పాటు మిగతా బ్యాట్స్ విమెన్‌లు దారుణంగా విఫలమయ్యారు. దీంతో బంగ్లాదేశ్‌కు 113 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని నిర్దేశించింది.అనంతరం 113 పరుగల లక్షంతో బరిలోకి దిగిన బంగ్లా మహిళల జట్టు 7 వికెట్లు కోల్పోయి విజయం సాధించింది. దీంతో బంగ్లాదేశ్ మహిళల జట్టు తొలిసారి ఆసియాకప్ టి20 టైటిల్‌ను గెలుచుకుంది.

Comments

comments