Search
Saturday 22 September 2018
  • :
  • :

హిమదాస్‌కు సన్మానం

Asian Games 2018 Gold Medal Winner Hima Das

గౌహతి: ఆసియా క్రీడల్లో పతకాల పంట పండించిన స్టార్ అథ్లెట్ హిమదాస్‌ను సోమవారం గౌహతిలో ఘనంగా సన్మానించారు. ఇక్కడి సరుసాజాయ్ స్పోర్ట్ కాంప్లెక్స్‌లో సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా హిమదాస్ మీడియాతో మాట్లాడింది. క్రీడాకారులకు తగిన సౌకర్యాలు, సదుపాయాలు, ప్రోత్సహకాలు కల్పిస్తే క్రీడల్లో మెరుగైన ఫలితాలు సాధిస్తారని వివరించింది. ఆసియా క్రీడల్లో భారత అథ్లెట్లు మెరుగ్గా రాణించేందుకు వారికి లభించిన శిక్షణ పద్ధతులే కారణమని తెలిపింది. గతంతో పోల్చితే ప్రస్తుతం దేశంలో క్రీడాకారులకు పలు సౌకర్యాలు అందుబాటులోకి వచ్చాయని తెలిపింది. శిక్షణ పొందే అథ్లెట్లకు మంచి సౌకర్యాలు కల్పిస్తే వారు మెరుగైన ఆటగాళ్లుగా ఎదగడం ఖాయమని చెప్పింది. ఆసియా క్రీడలకు ముందు అథ్లెట్లకు మంచి శిక్షణ లభించిందని తెలిపింది. ఆటగాళ్లకు అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన శిక్షణతో పాటు దానికి తగినట్టుగా పౌష్టిక ఆహారం లభించిందని వివరించింది. దీంతో చాలా మంది ఆటగాళ్లు ఇండోనేషియాలో పతకాలు గెలుచుకోగలిగారని తెలిపింది. భవిష్యత్తులో మరింత మెరుగ్గా రాణించాలంటే సౌకర్యాలు, సదుపాయాలు. ప్రోత్సహకాలు మరింత పెరగాలని సూచించింది. ఆటగాళ్లకు తగిన ప్రోత్సహం లభిస్తే వారు మేటి అథ్లెట్లుగా ఎదగడం ఖాయమని హిమదాస్ జోస్యం చెప్పింది. అస్సాం ఒలింపిక్ సంఘం, క్రీడా మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఈ సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.

Comments

comments