Search
Tuesday 25 September 2018
  • :
  • :
Latest News

రోయింగ్ లో భారత్ కు స్వర్ణం, కాంస్యం

Rowers
జకర్తా: ఆసియా క్రీడల్లో భారత్ మరో స్వర్ణ పతకంతో పాటు రెండు కాంస్య పతకాలను గెలుచుకుంది. రోయింగ్ క్వాడ్రుపుల్  పురుషుల విభాగంలో భారత  ఆటగాళ్లు సవర్ణ్ సింగ్, దత్తుబోకనల్, ఓమ్ ప్రకాశ్, సుఖ్ మిత్ సింగ్ అద్భుతమైన ప్రదర్శన చేసని పసిడిని తమ ఖాతాలో వేసుకున్నారు. ఈ విభాగంలో ఇండోనేషియా రజతం , థాయ్ లాండ్ కాంస్యం పతకాలను దక్కించుకున్నాయి.
రోయింగ్ లైట్ వెయిట్ డబుల్ స్కల్స్ విభాగంలో భారత్ కు కాంస్యంతో సరిపెట్టుకుంది. రోహిత్ కుమార్, భగవాన్ దాస్ జట్టు మూడోస్థానంలో నిలిచి ఈ పతకాన్ని గెలుపొందారు. భారత్ ఇప్పటి వరకు ఆసియా క్రీడల్లో 21 పతకాలు గెలుచుకుంది. (ఐదు స్వర్ణాలు, నాలుగు రజతాలు, 12 కాంస్యం)

Comments

comments