Search
Thursday 20 September 2018
  • :
  • :
Latest News

రెండో రౌండ్‌లోకి సైనా, సింధు

Asian Games Sindhu, Saina move to second round

ఆసియా క్రీడల్లో భాగంగా జరిగిన మహిళల సింగిల్ బ్యాడ్మింటన్ సింగిల్ విభాగం రెండో రౌండ్లోకి భారత షట్లర్లు పి.వి.సింధు, సైనా నెహ్వాల్ ప్రవేశించారు. అయితే ప్రపంచ 52వ ర్యాంకరైన వియత్నాంకు చెందిన వూ థి ట్రాంగ్ మాత్రం ఈ పోటీలో పూసర్ల వి. సింధుకు గట్టి పోటీ ఇచ్చింది. ఒకవిధంగా చెప్పాలంటే దాదపు ఓడించినంత పనిచేసింది. వారిద్దరి మధ్య మొదటి గేమ్ 11 నిమిషాలు, రెండో గేమ్ 17 నిమిషాలు, మూడో గేమ్ 30 నిమిషాలపాటు హోరాహోరి పోరు నడిచింది. అతి కష్టం మీద సింధు 2110, 1221, 2321 తేడాతో గెలిచింది. తదుపరి సింధు ఇండోనేషియాకు చెందిన జార్జియా మరిస్కాతో తలపడనుంది.

ఇదిలా ఉండగా మరో మ్యాచ్‌లో భారతీయ షట్లర్ సైనా నెహ్వాల్ ప్రత్యర్థి ఇరాన్ షట్లర్ సొరయాపై సునాయాస విజయాన్ని సాధించింది. ప్రత్యర్థిని 217, 219 వరుస సెట్లలో ఓడించింది. వారిద్దరి మధ్య మ్యాచ్ 26 నిమిషాల్లోనే ముగియడం గమనార్హం. ఇదిలా ఉండగా మహిళల డబుల్స్ రౌండ్ 32లో పొన్నప్ప అశ్వినీ, ఎన్. సిక్కీ రెడ్డి జోడీ హాంకాంగ్‌కు చెందిన యూంగ్ గ టింగ్, గ వింగ్ యంగ్ జోడిపై 2116, 2115 తేడాతో వరుస సెట్లలో విజయం సాధించింది. కాగా పురుషుల డబుల్స్ రౌండ్ 32లో రాంకీరెడ్డి సాత్విక్ సాయిరాజ్, శెట్టి చిరాగ్ జోడీ, హాంకాంగ్‌కు చెందిన తమ్ చున్ హి, చుంగ్ యోనీ జోడీని 2112, 2114 తేడాతో వరుస గేముల్లో ఓడించింది.

Comments

comments