Home తాజా వార్తలు ఆస్పిరిన్‌తో కాలేయ క్యాన్సర్ తగ్గుదల

ఆస్పిరిన్‌తో కాలేయ క్యాన్సర్ తగ్గుదల

Aspirin can reduce liver cancer

రెగ్యులర్‌గా ఆస్పిరిన్‌ను వినియోగిస్తే వారానికి రెండు మూడు డోసుల టాబ్లెట్ల వంతున ఐదేళ్ల పాటు వాడితే కాలేయ క్యాన్సర్ ప్రారంభ దశను తగ్గిస్తుందని శాస్త్రవేత్తలు వివరిస్తున్నారు. అమెరికాలోని మసాచుసెట్స్ జనరల్ ఆస్పత్రి ఆధారంగా హార్వర్డ్ మెడికల్ స్కూలు పరిశోధకులు ఈమేరకు అధ్యయనం చేశారు. ఈ అధ్యయనం గత అధ్యయనాలను బలపరుస్తోం ది. గత అధ్యయనంలో ప్రపంచ వ్యాప్తంగా ప్రాణాలను బలిగొంటున్న రెండవ క్యాన్సర్ రకం హెపటో సెల్యులర్ కేర్సినోమా (హెచ్‌సిసి)ను తగ్గిస్తుందని తేలింది. దీని ఆధారంగా ఈ అధ్యయనం సాగింది. అసలు ఆస్పిరిన్‌ను ఉపయోగించని పరిస్థితితో పోలిస్తే రెగ్యులర్‌గా ఆస్పిరిన్‌ను వినియోగించే వారిలో హెపటో సెల్యులర్ కేర్సినోమా రిస్కు తగ్గుతుందని రుజువైంది. ఆస్పిరిన్ డోసు ఎక్కువైన కొద్దీ రిస్కు తగ్గుతున్నట్టు తాము గమనించామని పరిశోధకులు వివరించారు. – సైన్స్ విభాగం