Search
Tuesday 13 November 2018
  • :
  • :
Latest News

ఆస్పిరిన్ … క్యానర్స్ రోగులకు తోడ్పాటు

ASPIRINలండన్ : క్యాన్సర్‌తో బాధ పడుతూ చికిత్స పొందే రోగులు తక్కువ మోతాదులో ఆస్పిరిన్ తీసుకోవడం వల్ల మనుగడ రేటు 20 శాతం పెరుగుతుందని తాజా పరిశోధనలో గుర్తించారు. ఆస్పిరిన్ వల్ల క్యాన్సర్ వ్యాప్తి కూడా తగ్గుతుందని ఈ పరిశోధనలో తేలింది. కార్డిఫ్ యూనివర్సిటీ పరిశోధకులు పలు అధ్యయనాలను పరిశీలించడం ద్వారా ఈ విషయాన్ని గుర్తించారు. ఆస్పిరిన్ తీసుకోవడం ద్వారా కొన్ని రకాల క్యాన్సర్లు తగ్గుతాయనే విషయంలో గణనీయమైన ఆధారాలు ఉన్నాయని పరిశోధకుడు పీటర్ ఎల్‌వుడ్ తెలిపారు. పేగులు, రొమ్ము, ప్రొస్టేట్ క్యాన్సర్ రోగులు, తాము పొందుతున్న చికిత్సతో పాటు తక్కువ మోతాదుల్లో ఆస్పిరిన్ తీసుకోవడం ద్వారా మరణాల రేటు 15 నుంచి 20 శాతం వరకు తగ్గినట్లు నిర్ధారణ అయిందని, క్యాన్సర్ వ్యాప్తి కూడా తగ్గుతున్నట్లు తేలిందని పీటర్ వివరించారు. ఈ అంశంపై మరిన్ని అధ్యయనాలు చేయాల్సి ఉందని ఆయన స్పష్టం చేశారు.

Comments

comments