Home తాజా వార్తలు అసెంబ్లీ రద్దుపై దాఖలైన పిటిషన్లు కొట్టివేత

అసెంబ్లీ రద్దుపై దాఖలైన పిటిషన్లు కొట్టివేత

The High Court dismissed the public litigation

హైదరాబాద్: తెలంగాణలో ప్రతిపక్ష పార్టీలకు హైకోర్టులో మరో ఎదురుదెబ్బ తగిలింది. తెలంగాణ అసెంబ్లీ రద్దును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లను హైకోర్టు కొట్టేసింది. కాంగ్రెస్ మాజీ ఎంఎల్‌ఎ డికె అరుణ, శశాంక్ రెడ్డి వేసిన పిటిషన్లను ధర్మాసనం కొట్టివేసింది. గతంలో ఓటర్ల జాబితా తప్పుల తడఖాగా ఉందని కాంగ్రెస్ నేత మర్రి శశిధర్ రెడ్డి వేసిన పిటిషన్‌ను కోర్టు కొట్టేసిన విషయం విధితమే. ఓటర్ల ఫైనల్ జాబితాను విడుదల చేయాలని కోర్టు ఇసికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతోపాటు శుక్రవారం ఓటర్ల జాబితా విడుదల చేయాలని ఆదేశించింది. కోర్టులు ఎన్ని సార్టు మొట్టికాయలు వేసినా కాంగ్రెస్ పార్టీ నేతలు మారడంలేదు.

Assembly Dissolve Petitions Dismissed by High court

Telangana news