Search
Wednesday 26 September 2018
  • :
  • :

అసెంబ్లీని అడవుల్లో పెట్టుకోవచ్చుగా!

సేవ్ ధర్నాచౌక్ దీక్షా శిబిరంలో ప్రొఫెసర్ నాగేశ్వర్ 

Nageswar-Rao

హైదరాబాద్: ఎక్కడో 25 కిలో మీటర్ల దూరాన వెళ్లి నిరసన తెలుపుకోవచ్చని పాలకులు భావిస్తే, అసెంబ్లీని కూడా నల్లమల అడవుల్లో పెట్టుకోవచ్చు కదా? అని మాజీ ఎం ఎల్‌సి ప్రొఫెసర్ జి.నాగేశ్వర్ అన్నారు. ధర్నాచౌక్ పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో ‘సేవ్ ధర్నాచౌక్’ అనే నినాదంతో వామపక్షాలు, ప్రజాసంఘాలు ప్రారంభించిన రిలే నిరసన దీక్షలు సోమవారానికి మూడవ రోజుకు చేరుకున్నాయి. అందులో భా గంగా కార్మిక సంఘాలు చేపట్టిన రిలే నిరసన దీక్షను నాగేశ్వర్ ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ నిరసన హక్కు వల్లనే తెలం గాణ రాష్ట్రం ఏర్పడిందని, దీనిని పాలకులు విస్మ రించొద్దన్నారు. ప్రజాస్వామ్యంలో పౌరులు పాల కుల విధానాలపై తమ నిరసనను వ్యక్తం చేసే హక్కును రాజ్యాంగం కల్పించిందని, ఢిలీల్లోని రామ్‌లీలా మైదానంలో నిరసన విషయమై 2013 సుప్రీం కోర్టు స్పష్టమైన తీర్పు ఇచ్చిందని గుర్తుచేశారు.

కొన్ని సందర్భాలలో ప్రభుత్వం సహేతుకమైన ఆంక్షలు విధించవచ్చని, కాని నిరసన హక్కును మాత్రం కాలరాయలేరని ఆయన పేర్కొన్నారు. ఉద్యమ సాంప్రదయాలకు నిలయంగా ఉన్న తెలంగాణలో ఉద్యమాలు, నిరసనలు తెలిపే హక్కును కాపాడేందుకు ధర్నాచౌక్‌ను పునరుద్ధరించి, ప్రజాస్వామ్య ప్రభుత్వంగా పేరు తెచ్చుకోవాలని సూచించారు. ప్రభుత్వం కనీస సాంప్రదాయాలను అంగీ కరించకపోవడం తెలంగాణ రాష్ట్రానికి అవమానకరమన్నారు. దీక్షలో కూర్చున్న నాయకులు ధర్నాచౌక్‌ను తరలించడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఎఐటియుసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉజ్జిని రత్నాకర్‌రావు మాట్లాడుతూ టిఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను అనుసరిస్తుందని విమర్శించారు.అధికారంలోనికి రాకముందు కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్దీకరిస్తామని, అవుట్‌సోర్సింగ్ వ్యవస్థను రద్దు చేస్తామని, ఇలా అనేక వాగ్ధానాలు చేఉసిన కెసిఆర్ అధికారంలోనికి వచ్చాక ఏ వాగ్ధానాన్ని నిలుపుకోలేకపోయారన్నారు.

సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సాయిబాబు మాట్లాడుతూ కెసిఆర్ కార్పోరేట్ శక్తులకు భజనకు అలవాటుపడ్డారన్నారు. ఇలాంటి ప్రమాదకరమైన విధానాల్లో భాగమే ధర్నాచౌక్ ఎత్తివేశారన్నారు. ఐఎఫ్‌టియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.సూర్యం మాట్లాడుతూ కెసిఆర్ మొండి విధానం ఎల్లకాలం చెల్లదన్నారు. ఐఎన్‌టియుసి నాయకులు ప్రకాష్‌గౌడ్ మాట్లాడుతూ కార్మిక సంఘాలు చేపట్టిన న్యాయమైన పోరాటానికి తమ పూర్తి మద్దతు ఉంటుందన్నారు. టిఎన్‌టియుసి అధ్యక్షులు ఎం.కె.బోస్ మాట్లాడుతూ మే 15న చేపట్టనున్న ందిరాపార్కు ఆక్రమణను విజయవంతం చేయాలని, అన్ని సంఘాలు జనసమీకరణ చేయాలన్నారు. ఐఎఫ్‌టియు రాష్ట్ర ఉపాధ్యక్షులు పి.ఎల్.పద్మ, ప్రధాన కార్యదర్శి ఎం.శ్రీనివాస్ మాట్లాడుతూ ధర్నాచౌక్ విషయంలో మంత్రుల ఇంటివద్దనే ధర్నాలు చేయాలన్నారు. ఇంకా ఎఐటియుసి కార్యదర్శి బోస్,సిఐటియు రాష్ట్ర కార్యదర్శి జె.వెంకటేష్, ఎఐసిసిటియు రాష్ట్ర అధ్యక్షులు డి.రామన్న, ఎఐయుటియుసి రాష్ట్ర కన్వీనర్ సుధీర్, ఐఎఫ్‌టియు రాష్ట్ర అధ్యక్షులు ఆరేపల్లి కృష్ణ దీక్షలో పాల్గొన్నారు.

Comments

comments