Home తాజా వార్తలు జూన్ 2 తెలంగాణ ప్రజలకు పర్వదినం

జూన్ 2 తెలంగాణ ప్రజలకు పర్వదినం

Speaker Madhusudhana Chary

హైదరాబాద్: అసెంబ్లీలో రాష్ట్రావతరణ వేడుకలు వైభవంగా ప్రారంభమయ్యాయి. అసెంబ్లీ ఆవరణలో స్పీకర్ మధుసూదనాచారి, మండలిలో డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్ జాతీయ జెండా ఆవిష్కరించి రాష్ట్రావతరణ వేడుకలను ప్రారంభించారు. ఆ తరువాత మహాత్మాగాంధీ, అంబేద్కర్ విగ్రహాలకు నేతలు నివాళులర్పించారు.

ఈ సందర్భంగా స్పీకర్ మధుసూదనాచారి మాట్లాడుతూ… తెలంగాణ రాష్ట్ర ప్రజలకు రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం శుభాకాంక్షలు తెలిపారు. జూన్ 2 అంటే తెలంగాణ ప్రజలకు పర్వదినమన్నారు. 60వ ఏళ్ల పోరాట కృషి ఫలితాన్ని ప్రజలందరూ అనుభవిస్తున్నారని గుర్తు చేశారు. అభివృద్ధిలో రాష్ట్రం దూసుకుపోతుందని స్పీకర్ వెల్లడించారు. అంతేగాక వచ్చే రెండేళ్లలో మరింత అభివృద్ధి సాధించడం ఖాయమన్నారు. బంగారు తెలంగాణ సాధనలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.