Search
Tuesday 25 September 2018
  • :
  • :
Latest News

కాల్వశ్రీరాంపూర్ ఎఎస్‌ఐ ఆత్మహత్య

ASI1

కాల్వశ్రీరాంపూర్: కాల్వశ్రీరాంపూర్ ఎఎస్‌ఐ కొమురం రామనాధం ఆదివారం ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మండల కేంద్రంలోని పోలీస్ క్వార్టర్స్‌లో తనకు కేటాయించిన ఇంటిలో ఒంటరిగా ఉం టున్నారు. ఆదివారం సాయంత్రం వరకు కార్యాలయానికి రాకపోవడంతో, రైటర్ స్వామి వెళ్లి చూసేసరికి తన గదిలో ఫ్యాన్‌కు ఉరివే సుకుని చనిపోయి ఉన్నాడు. పెద్దపల్లి ఎసిపి నల్ల మల్లారెడ్డి, సుల్తానాబాద్ సిఐ తుల శ్రీని వాస రావు, ఎఎస్‌ఐలు ఉమాసాగర్, రమేష్, జీవన్‌లు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. జయ శంకర్ భూపా లపల్లి జిల్లా మంగపేట మండలం, దోమేడ గ్రామానికి చెందిన రామనాధం 1983లో బ్యాచ్ నెం 545ద్వారా పోలీ స్ ఉద్యోగంలో చేరాడు. గోదావరిఖని టూటౌన్ నుండి రెండు నెలల క్రితం కాల్వశ్రీరాంపూర్ పోలీస్ స్టేషన్‌కు ఎ ఎస్సైగా బదిలీపై వచ్చాడు. కుటుంబ కలహాలవల్ల తాగుడుకు బానిసై ఆత్మహత్యకు పాల్పడినట్లు భావిస్తున్నారు. మృతుని భార్య, ముగ్గురు కూతుర్లు కరీంనగర్‌లో నివాసముంటున్నారు.

Comments

comments