Search
Monday 19 November 2018
  • :
  • :
Latest News

ఎన్నికలకు అన్నీ ఏర్పాట్లు పూర్తి : రజత్ కుమార్

Electiion-Commisioner

హైదరాబాద్: అసెంబ్లీ రద్దు అయిన తరువాత.. నిబంధనల ప్రకారం ఆరు నెలల్లోగా ఎన్నికలు నిర్వహించాలని తెలంగాణ ప్రధాన ఎన్నికల కమిషనర్ రజత్ కుమార్ తెలిపారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఎన్నికలు ఎప్పుడు నిర్వహించాలి అనేది ఎక్కడా పేర్కొనలేదన్నారు. తెలంగాణలో జరిగే అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు కావాల్సిన అన్నీ ఏర్పాట్లు పూర్తి చేశామని వెల్లడించారు. రాష్ట్రంలో ఎన్నికల ఏర్పాట్లపై కేంద్రం ఎన్నికల సంఘం సంతృప్తి చెందాలన్నారు. ఓటర్లను చైతన్నపర్చేందుకు మా యంత్రాంగం చర్యలు చేపట్టిందని, ప్రతి గ్రామంలోనూ ప్రజలను చైతన్యపరిచేలా ప్రత్యేక కార్యక్రమాలు కొనసాగుతున్నాయని వివరించారు. సామాజిక మాధ్యమాల్లోనూ ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని రజత్ వెల్లడించారు. రాజకీయ పార్టీల సమక్షంలోనే ఇవిఎంల పనితీరును పరిశీలిస్తామని చెప్పారు. భారత దేశంలో ఇవిఎంల పనితీరు చాలా పక్కగా ఉందని వెల్లడించారు. న్యాయస్థానాల్లో 37 కేసులు వేసినా ఇవిఎంలపై అనుకూలంగానే నిర్ణయం వచ్చిందని గుర్తు చేశారు.

Telangana news, Telangana Breaking news, Telangana Latest news

Assmebly Elections in Telangana

Comments

comments