Search
Saturday 17 November 2018
  • :
  • :
Latest News

భగీరథకు భరోసా

bagiratha

రిజర్వాయర్లు కనీస మట్టం చేరినా నీరు తీసుకునే అవకాశం 

మన తెలంగాణ/ హైదరాబాద్: ప్రతి ఇంటికి నల్లాల ద్వారా మంచినీటిని అందించాలనే లక్షం తో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని చేపట్టిన మిషన్ భగీరథకు ఎలాంటి పరిస్థితుల్లో నూ నీటి కొరత లేకుండా ప్రభుత్వం శాశ్వత ప్రాతిపదికన ఏర్పాట్లు చేసింది. తీవ్ర వర్షాభావ పరిస్థితుల్లో రిజర్వాయర్లలో నీరు కనీస నీటి మట్టం కంటే దిగువకు పడిపోయినప్పటికి మిషన్ భగీరథకు నీరు తీసుకునే వీలును కల్పించిం ది. అలాంటి పరిస్థితుల్లో భగీరథకు అధిక శాతం నీరందించే పాలేరు, యెల్లేరు, సింగూరు వం టి ప్రాజెక్టుల వద్ద ఇప్పటికే కట్ట కట్టి నీరును తోడుకుని తీసుకునేందుకు మోటార్ల ఏర్పాటును చేశారు. ప్రస్తుతానికి ఈ పరిస్థితులు నెలకొనలేదని, ఈ వేసవిలో కూడా కొరత ఏర్పడే అవకాశాలు లేవని గ్రామీణ నీటి సరఫరా విభాగం ఇంజినీర్ ఇన్‌చీఫ్ సురేందర్ రెడ్డి తెలిపారు. శ్రీశైలంలో మాత్రం నీటి మట్టం గణనీయంగా తగ్గిందని చెప్పారు. శ్రీశైలం నీటికి సంబంధించి ఒక పాలేరు నుంచి భగీరథకు 4.70టిఎంసీలు నీటిని కేటాయించారు. పాలేరులో కట్ట కట్టి నీటిని తోడేందుకు మోటార్లను ఏర్పాటు చేశారు. శ్రీశైలంలో నీటి మట్టం 840 అడుగులు ఉంటే దాదాపు 55టిఎంసీలు, 800 అడుగులు ఉంటే దాదాపు 30టిఎంసీలు, 780 అడుగుల నీటి మట్టం ఉంటే 18 నుంచి 19టిఎంసీల నీరు అందుబాటులో ఉంటుందని ఇఎన్‌సి సురేందర్ రెడ్డి తెలిపారు. ఇంత కంటే తక్కువ నీటి మట్టం ఉన్నప్పటికి భగీరథకు నీరు తీసుకునే విధంగా ప్రభుత్వం ఆదేశించిందని, ఈమేరకు నీటి పారుదల శాఖ ఉత్తర్వులు కూడా జారీ చేసిందన్నారు. ప్రస్తుతం మిషన్ భగీరథ ద్వారా 10వేల గ్రామాలకు పూర్తి స్థాయిలో నీటిని అందిస్తున్నారు. దీనికి సరిపడా నీరు ప్రస్తుతం ఉంది. భగీరథ జూలై చివరి నాటికి పూర్తిస్థాయిలో పూర్తవుతుంది. అప్పటి వరకు రిజర్వాయర్లలో కనీస నీటి మట్టం వరకు నీరు చేరుకునే అవకాశాలు ఉన్నందున నీటి కొరత ఉండదన్న భరోసాను ఆయన వ్యక్తం చేశారు. ఈ ఏడాదే కాకుండా భవిష్యత్తులోనూ భగీరథకు నీటి కొరత లేకుండా కృష్ణా బేసిన్‌లోని 15 రిజర్వాయర్లు, గోదావరి బేసిన్‌లలోని 21 రిజర్వాయర్ల నుంచి నీటిని కేటాయించారు. ఈ రిజర్వాయర్ల నుంచి భగీరథకు నీటి కోసం కనీస నీటి మట్టాలను (ఎండిడిఎల్) నిర్ణయించి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు నీటి పారుదల శాఖ ఉత్తర్వులను జారీ చేసింది. దీని ప్రకారం భగీరథకు కృష్ణా బేసిన్‌లోని పాలేరు రిజర్వాయర్ నుంచి 133.29 మీటర్ల ఎండిడిఎల్ ( మినిమమ్ డ్రాన్ డౌన్ లెవల్) వరకు 4.70 టిఎంసీలను కేటాయించారు. అలాగే ఎకెబిఆర్ రిజర్వాయర్ నుంచి 1.35టిఎంసీలు, ఎండిడిఎల్ 241.40మీటర్లు, వైరా నుంచి 1.28టిఎంసీలు, 94.65మీటర్లు, పిడి.పల్లి 0.12టిఎంసీలు, 146మీటర్లు, పెందిపాకల నుంచి 0.90టిఎంసీలు, 229.80మీటర్లు, ఉదయసముద్రం నుంచి 2.59టిఎంసీలు, 219.32మీటర్లు, కోలీసాగర్ నుంచి 1.365టిఎంసీలు,409.35మీటర్లు, జూరాల నుంచి 1.22టిఎంసీలు, 313.75మీటర్లు, రామన్‌పాడు నుంచి 1టిఎంసీ,311.03మీటర్లు, గోపాలదిన్నే నుంచి 0.05టిఎంసీలు, 301.75మీటర్లు, శంకరసముద్రం నుంచి 0.315టిఎంసీలు, 350మీటర్లు, రంగసముద్రం నుంచి 0.1టిఎంసీలు, 316.84మీటర్లు, సుంకేశుల నుంచి 0.14టిఎంసీలు, 289మీటర్లు, యెల్లోర్ నుంచి 7.12టిఎంసీలు, 338మీటర్ల ఎండిడిఎల్ వరకు నీటి కేటాయింపులు జరిగాయి. నుంచి 2టిఎంసీలు కేటాయించారు. అలాగే గోదావరి బేసిన్‌లోని గడ్డెన్న వాగు ప్రాజెక్టు నుంచి 0.55టిఎంసీలు, 357.5మీటర్లు, స్వర్ణ ప్రాజెక్టు నుంచి 0.08టిఎంసీలు, 352.35మీటర్లు, శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నుంచి 6.50టిఎంసీలు, 320.35మీటర్లు, కడెం నుంచి 0.28టిఎంసీలు,204.21మీటర్లు, కొమురంభీం నుంచి 1.77టిఎంసీలు, 234.60మీటర్లు, ఎల్లంపల్లి నుంచి 2.82టిఎంసిలు, 146.4మీటర్లు, మేడారం నుంచి 0.18టిఎంసీలు, 228మీటర్లు, మిడ్‌మానేరు నుంచి 1.41టిఎంసీలు, 303.3మీటర్లు, లోయర్ మానేరు నుంచి 6.16 టిఎంసీలు, 275.97మీటర్లు, భీంఘన్‌పూర్ నుంచి 0.37టిఎంసిలు, 166.91మీటర్లు, ధర్మసాగర్ నుంచి 1.03టిఎంసీలు, 307.46మీటర్లు, సాలివాగు నుంచి 0.47టిఎంసీలు, 212.1మీటర్లు, రామప్పలేక్ నుంచి 0.24టిఎంసీలు, 198.09మీటర్లు, ములుగుఘన్‌పూర్ నుంచి 0.69టిఎంసీలు, 191.92మీటర్లు, కిన్నెరసాని నుంచి 0.45టిఎంసీలు,109.73మీటర్లు, అలీసాగర్ నుంచి 0.82టిఎంసీలు, 395.25మీటర్లు, బల్లాల్ నుంచి 0.18టిఎంసీలు, 371.627మీటర్లు, చిట్టకోడూర్ నుంచి 0.17టిఎంసీలు, 387మీటర్లు, సింగూర్ నుంచి 5.70టిఎంసీలు 520.50 ఎండిడిఎల్ వరకు తీసుకునేవిధంగా కేటాయింపులు జరిపారు. వీటితో పాటు గోదావరి బేసిన్‌లోని దుమ్ముగూడెం ఆనకట్ట నుంచి 2.11టిఎంసీలు గోదావరి నది నుంచి 0.6టిఎంసీల నీటిని కేటాయించారు.

Comments

comments