Home లైఫ్ స్టైల్ ఊబకాయంతో ఆస్తమా ముప్పు

ఊబకాయంతో ఆస్తమా ముప్పు

Asthma in Children Symptoms and Risk Factors

ఆస్తమా వ్యాధి రావడానికి చాలా రకాల కారణాలు ఉన్నాయి. ఈ వ్యాధి వచ్చిన వారి ఊపిరితిత్తుల్లోని వాయు మార్గాలు ఎర్రబడి కుచించుకుపోతాయి. దాంతో శ్వాస తీసుకోవడం కష్టంగా మారుతుంది. విపరీతమైన దగ్గు, ఛాతీలో నొప్పి వంటి సమస్యలు మొదలవుతాయి. అమెరికాలోనే ఈ ఆస్తమా బాధితులు ఎక్కువగా ఉన్నారని అధ్యయనాలు తెలుపు తున్నాయి. ఇక పిల్లల విషయంలో ప్రపంచవ్యాప్తంగా 70 లక్షలమంది ఆస్తమాతో బాధపడుతున్నట్లు అంచనా వేస్తు న్నారు. ఇక భారతదేశంలోనూ చిన్న పిల్లల్లో పది శాతం మంది వరకు ఏదో ఒక స్థాయిలో ఆస్తమా సమస్యను ఎదుర్కొంటున్నారని చెపుతున్నారు. శరీరానికి విటమిన్ డి తక్కువగా ఉంటే ఆస్తమా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. వేరువేరు వ్యక్తులకు రకరకాల కారణాలతో వస్తూ ఉంటుంది. ప్రపంచం మొత్తం మీద వీరి సంఖ్య కోట్లలో ఉందని అంచనా వేశారు. ఉబ్బసం వ్యాధి ఉన్నవారికి ఆస్తమా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. ఆస్తమా వచ్చినవారు తమ సమస్యకు కారణం ఏమిటో కచ్చితంగా తెలుసుకుని చికిత్స తీసుకోవాలి. లైఫ్ స్టైల్ మార్చుకోవడం, తగిన చికిత్స తీసుకోవడం వల్ల ఆస్త్మాను నివారించుకోవచ్చు. రుతువులలో మార్పు ఉబ్బస వ్యాధికి కారణం అవుతుంది. దీన్ని సీజనల్ ఆస్తమా అంటారు. ఆ రుతువు మొదలవటానికన్నా ఒకటి, రెండు వారాలు ముందే ఆస్తమా నివారణ మందులు మొదలుపెట్టి కొన్ని వారాలు క్రమంగా వాడితే మంచిది.
ఎక్కువగా జలుబు చేయటం, శ్వాసకోశ వ్యాధులతో బాధపడేవారికి ఆస్తమా వచ్చినట్లు గుర్తించాలి. ఊబకాయం, శరీరంలో అధిక కొవ్వుతో బాధపడుతున్న వారికి త్వరగా ఆస్తమా వచ్చే అవకాశం ఉంది. దీనిని పూర్తిగా నివారిం చగలిగే మందులు, చికిత్సా పద్ధతులు ఏవీ అందుబాటులో లేవు. ముందు జాగ్రత్తలతోనే దీనిని నివారించుకోవాలి. చిన్న పిల్లల్లో వచ్చే ఆస్తమాకు సరియైన చికిత్స తీసుకుంటే వారు పెద్దయ్యే కొద్దీ పూర్తిగా తగ్గిపోయే అవకాశాలు ఉన్నాయి. వీరు దుమ్ము, కాలుష్యం వంటి వాటికి దూరంగా ఉంటే మంచిది. ఇన్‌హేలర్స్‌ను సరిగా వాడగలిగిన వారికి డ్రై పౌడర్ ఇన్‌హేలర్స్ లేదా మీటర్డ్ డోస్ ఇన్‌హేలర్స్‌ను స్పేసర్ ద్వారా ఇవ్వవచ్చు. ఆస్తమాను ఇంట్లో చేతికందుబాటులో ఉండే వాటితోనే కంట్రోల్‌లో పెట్టుకోవచ్చు. ఉదాహరణకు, వేడినీటి ఆవిరిని పీల్చడం, మెంతులను రాత్రంతా నీటిలో నానబెట్టి, ఉదయం తీసుకోవడం వల్ల ఆస్తమాను అదుపులో పెట్టుకోవచ్చు. ఆరోగ్యకరమైన విటమిన్స్ ఎ, ఇ, సి, బీటా కెరోటిన్ వంటివి ఆస్తమా వ్యాధి గ్రస్తులకు బాగా సహకరిస్తాయి.
క్యారెట్స్ : క్యారెట్స్ లో విటిమన్ ఎ, యాంటీయాక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి.
ఫిష్ ఆయిల్ : ఫిష్ ఆయిల్ లో ఓమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉన్నాయి.
డైరీ ప్రొడక్ట్ : వీరు రెగ్యులర్‌గా డైరీ ప్రొడక్ట్‌ను తీసుకోవాలి. ఆస్తమాను కంట్రోల్ చేసుకోవచ్చు.
బిట్టర్ గార్డ్ : కాకరకాయ రసాన్ని ప్రతి రోజూ తీసుకోవడం వల్ల, ప్రేగులను శుభ్రం చేస్తుంది, ఆస్తమాను కంట్రోల్ చేస్తుంది.
కాలీఫ్లవర్: గ్రీన్ వెజిటబుల్స్ చాలా ఆరోగ్యకరమైనవి. వీటిలో అత్యధిక శాతంలో విటమిన్స్, ప్రోటీన్స్, మినరల్స్, శరీరానికి కావాల్సినవి పుష్కలంగా ఉంటాయి.
కివి : కివి పండులో విటమిన్ సి పుష్కలం. ఇది ఆస్తమా పేషంట్స్ లో ఇన్‌ఫ్లమేషన్, ఊపిరితిత్తుల పనిచేయక పోవడాన్ని తగ్గిస్తుంది.
ఆకుకూరలు : మీకు ఆస్తమా ఉన్నట్లైతే మీ రెగ్యులర్ డైట్ లో ఆకుకూరలను చేర్చుకోండి. ఇవి ఆరోగ్యకరం,పోషకాహారం.
కాబేజీ : ఈ గ్రీన్ లీఫీ వెజి టబుల్స్ విటమిన్ సి, విటమిన్ ఏ అధికంగా ఉన్న ఒక సూపర్ ఫుడ్.
జామకాయలు : వీటిలోని యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు ఆస్తమా రోగులకు చాలా మంచిది.
స్ప్రౌట్స్ : ఇవి అలెర్జీలను తగ్గిస్తుంది. ఆస్తమాను తగ్గి స్తుంది. మీ రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం వల్ల ఆస్తమాకు గురిచేసే అలర్జీలనుండి రక్షణ పొందవచ్చు.
రెడ్ చిల్లీ : రెడ్ చిల్లీ శ్వాసకు ఇబ్బంది కలిగించే మ్యూకస్‌ను క్లియర్ చేస్తుంది . ఇందులో యాంటీఆక్సిడెంట్స్ ఇన్‌ఫ్లమేషన్ తో పోరాడుతుంది.
మెడికల్ ట్రీట్‌మెంట్ తీసుకోవడం

మెడికల్ ట్రీట్‌మెంట్ తీసుకోవడంతో పాటు ఈ నాచురల్ రెమెడీ కూడా చేసుకోవచ్చు. దాంతో ఆస్త్మా లక్షణాలను నివారించుకోవచ్చు. ఉల్లిపాయలులో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు అధికంగా ఉన్నాయి. తేనెలోనూ యాంటీ ఆక్సిడెంట్స్ గుణాలు ఎక్కువగా కలిగిఉంది. ఈ రెంటినీ కలిపి మిక్స్‌చేసి పేస్ట్‌లా అయ్యేవరకు మిక్స్ చేయాలి. ఈ మిశ్ర మాన్ని ప్రతి రోజూ ఉదయం ఒక నెలరోజులు పాటు తీసుకుంటే మంచి ఫలితం కనిపిస్తుంది.
రోగ నిర్దారణ పరీక్షలు: వంశానుగత చరిత్ర, అలర్జీలు, ఎగ్జి మా, చర్మవ్యాధులు, చిన్నతనంలో శ్వాసకోస జబ్బులు.
* శారీరక పరీక్షలు, ముక్కు, గొంతు, ఛాతి పరీక్షలు * ఎక్స్-రే, కఫం పరీక్ష, పీ ఎఫ్ టీ.
* అలర్జీ చర్మ పరీక్షలు -అలర్జెన్స్ ను ఇంజెక్షన్ ద్వారా ఇచ్చి రియాక్షన్ చూడటం.
* స్పెరోమెట్రి- శ్వాస మీటర్ ద్వారా పరీక్ష.
* గుండె ఊపిరితిత్తులు, రక్తలోపం, కిడ్నీ వ్యాధులు, జీర్ణకోశ వ్యాధులు ఏవైన ఉంటే వాటి నిర్థారణ.
తీసుకోవలసిన జాగ్రత్తలు
* ఆస్తమాతోభాధపడేవారు కూడా సాధారణ వ్యక్తుల్లాగే తమ రోజు వారి పనులు చేసుకోవచ్చు అంటూ ప్రొత్సహించాలి.
* రాత్రి పొద్దున్న వచ్చే శ్వాస ఇబ్బందులను నివారించటం, నిర్మూలించటం, తగ్గించటం.
* ఎక్కువ శారీరక శ్రమ లేని ఉపాధి చూసుకోవడం
* దుమ్ము ధూళి, పొగ, చల్లటి వాతావరణాల నుండి దూరంగా ఉండటం.
* ఇంటి పరిసరాలు, ప్లాస్టిక్ బ్యాగ్స్, కార్పెట్స్, బెడ్ షీట్స్, బెడ్స్, బ్లాంకెట్స్‌లో చిన్న పరాన్న జీవులు ఉంటాయి. కాబట్టి రోజుకొకసారి ఎండలో వేయటం, తరచూ నీటితో శుభ్రం చేయటం.
* పెంపుడు జంతువులను దూరంగా ఉంచటం.
* ఎక్కువ తేమ శాతం ఉంటే చిన్న చిన్న పరాన్న జీవులు పెరుగుదల ఎక్కువ కాబట్టి అప్రమత్తంగా ఉండాలి.
నివారణా మార్గాలు : బ్రాంకోడయలేటర్స్, కార్టికో స్టెరా యిడ్స్, యాంటీ బయాటిక్స్, స్ప్రేస్ మందులు మొదల గునవి..వీటి వలన వెంటనే ఉపశమనం కలుగుతుంది కానీ మళ్ళీ తిరిగివస్తుంది. దీర్ఘకాలికంగా వాడటం వలన మందులు సైడ్ ఎఫెక్ట్, పిల్లల పెరుగుదల లోపాలు, మానసిక ఆందోళన, బరువు పెరగటం వంటివి కలుగవచ్చు.

లలిత తాతిరాజు