Search
Wednesday 14 November 2018
  • :
  • :
Latest News

ఆస్టన్ మార్టిన్ నుంచి అత్యాధునిక లగ్జరీ కారు

Aston-Martin-DB-11హైదరాబాద్ : సూపర్ లగ్జరీ స్పోర్ట్ కారు తయారీ సంస్థ ఆస్టన్ మార్టిన్ రెండు మోడల్స్ డిబి11, ర్యాపిడ్‌లను హైదరాబాద్‌లో ప్రదర్శించింది. ఈ సంస్థ దేశంలోనే మొట్టమొదటి సారిగా ఒక ప్రత్యేక రోడ్‌షోను నిర్వహిస్తోంది. సాహసోపేతమైన ‘డిబి’ నుంచి అక్టోబర్ 23, 24 తేదీలలో ఐటిసి గ్రాండ్ కాకతీయలో నిర్వహిస్తున్న ఈ రోడ్‌షో ద్వారా కార్లను ఇష్టపడే వారు మొదటిసారిగా వీక్షించే ఒక గొప్ప అవకాశాన్ని అందిస్తోంది. ఈ సంవత్సర ప్రధమార్ధంలో నిర్వహించిన 86వ అంతర్జాతీయ జెనీవా మోటార్ షోలో మొదటిసారిగా డిబి11ను అవిష్కరించింది. డిబి11ను ఎరోడైనమిక్ డిజైన్‌తో ఒక సరికొత్త రూపాన్ని సంతరించుకుంది, ఇందులో 5.2 లీటర్ ట్విన్‌టర్బోచార్జ్‌డ్ వి12 ఇంజన్‌తో, లోపల విశాలమైన స్థలం కలిగిన అత్యంత సమర్దమైన బాడీని తేలికైన మరియు బలమైన అల్యూమినియంతో నిర్మించారు. 2003లో ఆస్టన్ నుండి డిబి9ను పరిచయం చేసిన తరువాత దీనిని అత్యంత ప్రభావవంతం కలిగిన ఒక సరికొత్త ఆస్టన్ మార్టిన్‌గా చెప్పవచ్చు.

Comments

comments