Home తాజా వార్తలు మళ్లీ సిఎం కెసిఆరే.. భవిష్యత్తులో ప్రధాని కూడా…

మళ్లీ సిఎం కెసిఆరే.. భవిష్యత్తులో ప్రధాని కూడా…

Astrologer: Once again KCR will be CM of Telangana

అమరావతి: తెలంగాణ రాష్ట్ర తొలి అసెంబ్లీ గురువారం రద్దు అయినా సంగతి తెలిసిందే. అసెంబ్లీ రద్దు కావడంతో తెలంగాణలో ముందస్తు ఎన్నికల సందడి ప్రారంభమైంది. ప్రస్తుతం రాష్ట్రంలోని అన్ని పార్టీలు ప్రచార కార్యక్రమాలను ముమ్మరం చేస్తున్నాయి. టిఆర్ఎస్ శుక్రవారం నాటి హుస్నాబాద్ ప్రజా ఆశీర్వాద సభతో ఎన్నికల శంఖరావం పూరించింది. ఈ నేపథ్యంలో ఎపిలోని పశ్చిమగోదావరి జిల్లా భీమవరంకు చెందిన ప్రముఖ జ్యోతిష్కుడు మాండ్రు నారాయణ రమణారావు చెప్పిన జోష్యం వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తెలంగాణ సిఎం మళ్లీ కెసిఆరే అని మాండ్రు జోష్యం  చెప్పారు. కెసిఆర్ జాతకం ప్రకారం రవి, గురు, శుక్ర, శని, కుజ గ్రహాలు అనుకూలంగా ఉన్నాయని ఆయన వివరించారు. అందుకే ఈ సమయంలో కెసిఆర్ పట్టిందల్లా బంగారం అవుతుందని, ఆయనది ది విక్రమార్క చక్రవర్తి జాతకమన్నారు. ఇలాంటి జాతకం వంద కోట్ల మందిలో ఒక్కరికే మాత్రమే ఉంటుందని తెలిపారు. దైవ ప్రక్రియలు కొన్ని సహకరిస్తే భవిష్యత్తులో కెసిఆర్ ప్రధాని కూడా అవుతారని చెప్పుకొచ్చారు. 2009లో తెలంగాణ భవన్ లో అపూర్వ చండీయాగాన్ని తాను నిర్వహించడం వల్లే కెసిఆర్ కు రాజయోగం పట్టుకుందన్నారు. అయితే కెసిఆర్ తన ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అలాగే హెలికాప్టర్ ప్రయాణాలలో కూడా అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.