Search
Wednesday 26 September 2018
  • :
  • :

వ్యోమగాములు బయటపడే వ్యవస్థ

  విజయవంతంగా ప్రయోగించిన ఇస్రో

Rocket

బెంగళూరు: అత్యవసర స్థితిలో వ్యోమగాము లు తప్పించుకునేదెలా? అంతరిక్ష పద్మవ్యూ హం నుంచి బయటపడేదెలా? అనే అంశాల ను దృష్టిలో పెట్టుకుని భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) తాజాగా విజయవంతమైన ప్రయోగం నిర్వహించింది. తాము కొత్త గా రూపొందించిన క్రూ ఎస్కేప్ సిస్టం (సిబ్బంది రక్షక వ్యవస్థ)ను గురువారం విజయవంతంగా పరీక్షించింది. ఈ సిస్టమ్ సమర్థతను తెలుసుకునేందుకు, దీనిపై ఏ మేరకు ఆధారపడి ఉండొచ్చుననేది తెలుసుకునేందుకు ఈ ప్రయోగం నిర్వహించినట్లు ఇస్రో వర్గాలు తెలిపాయి. ఈ శ్రేణిలో ఇది తొలి ప్రయోగం అని , దీనిని విజయవంతంగా నిర్వహించామని అధికారులు తెలిపారు. పలు మానవ సహిత అంతరిక్ష ప్రయోగాలను ఇస్రో ప్రస్తుతం తలపెట్టింది. అయితే అంతరిక్షంలోకి పంపించిన యాత్ర విఫలం అయితే సిబ్బందిని వాహక నౌక నుంచి సురక్షిత ప్రదేశానికి జాగ్రత్తగా పంపించేందుకు ఇస్రో తమ పరిజ్ఞానంతో ఈ క్రూ ఎస్కేప్ సిస్టంను రూపొందించింది. ఇస్రో వర్గాలు ఈ ప్రయోగ దశ గురించి అధికారిక ప్రకటన వెలువరించాయి. ఈ తొలి ప్యాడ్ అబార్ట్ టెస్ట్‌తో సిబ్బందిని సురక్షితంగా బయటపడే విధంగా ఉన్న అమరికలను పరీక్షించారు. ఐదు గంటల కౌంట్‌డౌన్ తరువాత క్రూ ఎస్కేప్ సిస్టమ్‌ను నమూనా క్రూ వాహకనౌకతో ఉదయం ఏడు గంటలకు శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం ప్రయోగ వేదిక నుంచి ప్రయోగించింది. ఈ పరీక్ష నిడివి మొత్తం 259 సెకెండ్లుగా అంచనావేశారు. ఈ దశలో మోడ్యూల్ ఆకాశం వైపు దూసుకువెళ్లింది. తరువాత బంగాళాఖాతం మీదుగా వెళ్లుతూ అందులోని పారాచ్యూట్ల సాయంతో 2.9 కిలోమీటర్లు పయనించి తిరిగి శ్రీహరికోటలోని భూ కేంద్రంలోకి ప్రవేశించింది. ఇస్రో ఇప్పటికే స్వదేశీ నిర్మిత రియూజబుల్ లాంచ్ వెహికల్ (ఆర్‌ఎల్‌వి) సాంకేతిక పరిజ్ఞాన పాటవాన్ని పరీక్షించింది.  శాటిలైట్లను భూమి చుట్టూ పరిభ్రమింపచేసి తిరిగి  భూ వాతావరణ పరిధిలోకి చేరేందుకు ఆర్‌ఎల్‌వికి సామర్థం ఉంది.

Comments

comments