Home టెక్ ట్రెండ్స్ ఇండియా మార్కెట్ లోకి ఆసుస్ బడ్జెట్ స్మార్ట్‌ఫోన్

ఇండియా మార్కెట్ లోకి ఆసుస్ బడ్జెట్ స్మార్ట్‌ఫోన్

smartphone
న్యూఢిల్లీ: కొత్త ఫీచర్లను అందిపుచ్చుకోవడంతో పాటు బడ్జెట్ ఫోన్ల విషయంలో కూడా మొబైల్ తయారీ కంపెనీలు పోటీ పడుతున్నాయి. ఈ నేపథ్యంలో అసుస్ సంస్థ.. ఇండియా మార్కెట్ లోకి జెన్‌ఫోన్ మాక్స్ ఎమ్1 (జెడ్‌బి556కెఎల్), జెన్‌ఫోన్ మాక్స్ లైట్ (జెడ్‌బి556కెఎల్) అనే పేరుతో రెండు కొత్త స్మార్ట్‌ఫోన్లను  విడుదల చేసింది. ఈ ఫోన్ల ప్రారంభ ధరను రూ.6,999గా కంపెనీ ప్రకటించింది. జెన్‌ఫోన్ మాక్స్ ఎమ్1 (జెడ్‌బి556కెఎల్) ధర రూ.8,999, జెన్‌ఫోన్ మాక్స్ లైట్ (జెడ్‌బి556కెఎల్) ధర రూ.6,999 గా కంపెనీ నిర్ణయించింది. అంతే కాకుండా పండగ సందర్భాల్లో ఈ ఫోన్లపై రూ.1,000 డిస్కౌంట్‌ను కూడా అందించనున్నట్లు కంపెనీ పేర్కొంది. ఇక ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌లో కొనుగోలు చేస్తే మరిన్ని ఆఫర్లు, డిస్కౌంట్లు, క్యాష్‌బ్యాక్‌లు లభించనున్నట్లు తెలిపింది.
ఫీచర్లు: 5.45 అంగుళాల డిస్‌ప్లే, వెనక కెమెరా 13ఎంపి, ముందు కెమెరా 8ఎంపి, 4000 ఎంఎహెచ్ బ్యాటరీ సామర్థ్యం, 4.1 ఓరియో ఆండ్రాయిడ్, 3జిబి ర్యామ్/32జిబి అంతర్గత మెమోరి వంటి ఫీచర్లు ఈ స్మార్ట్ ఫోన్ లో ఉన్నాయి.

Asus Budget smartphone into Indian market