Home జాతీయ వార్తలు యుపిలో మరోసారి గాలివాన బీభత్సం!

యుపిలో మరోసారి గాలివాన బీభత్సం!

At least 15 People Killed in Uttar Pradesh due to Heavy Rains

లక్నో: యుపిని మరోసారి గాలివాన బెంబేలెత్తిస్తోంది. ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షానికి శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 15 మంది మృత్యువాత పడ్డారు. మరో తొమ్మిది మంది తీవ్రంగా గాయపడ్డారు. ఏకధాటిగా వీచిన గాలికి ఇండ్లు, చెట్లు కూలిపోవడంతో అధిక ప్రాణనష్టం సంభవించిందని ప్రభుత్వాధికారులు తెలిపారు. ఒక్క మోరాదాబాద్ జిల్లాలోనే అత్యధికంగా ఏడుగురు చనిపోయినట్లు తెలిసింది. దీంతో అధికారులు సహయక చర్యలను ముమ్మరం చేశారు. లోతట్టుప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. కాగా, గత నెలలో కూడా యుపిలో కురిసిన గాలివాన దెబ్బకు దాదాపు 130 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. వందలాది మంది నిరాశ్రయులయ్యారు. అది మరవకముందే మరోసారి గాలివాన బీభత్సం సృష్టిస్తోంది. దీంతో యుపి ప్రజలు బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు.