Search
Friday 21 September 2018
  • :
  • :

257మంది బలి

flight-collapse

అల్జీరియాలో ఘోర విమాన విలయం

బౌఫారిక్:అల్జీరియాలో బుధవారం జరిగిన ఘోర విమాన ప్రమాదంలో 257 మంది చనిపోయారు. మృతుల్లో చాలామంది సైనికులు, వారి కుటుంబ సభ్యులున్న్లారు. అల్జీర్స్ సమీపంలోని బౌఫారిక్ ఎయిర్ బేస్‌నుంచి బయలుదేరిన ఈ సైనిక విమా నం  కొద్ది సేపటికే విమానాశ్రయం సమీపంలోని పొలాల్లో కూలిపోయింది.విమానం కూలిపోయిన ప్రదేశంనుంచి దట్టమైన పొగలు, మంటలు ఎగసి పడుతూ ఉండడం, వందలాది అంబులెన్స్‌లు, డజన్ల సంఖ్యలో ఫైరింజన్లు సైరన్లు మోగించుకుం టూ ప్రమాద స్థలానికి వెళ్తున్న దృశ్యాలను స్థానిక టీవీలు ప్రసారం చేశాయి. 247 మంది ప్రయాణికులు,పదిమంది సిబ్బంది మృతి చెందినట్లు రక్షణ మంత్రిత్వశాఖ ఒక ప్రకటనలో తెలిపింది. అయితే ఎవరైనా ప్రాణాలతో బతికి బైట పడ్డారో మాత్రం తెలపలేదు. రక్షణశాఖసహాయమంత్రి జనరల్ అహ్మద్ గైద్ సలాహ్ సంఘటన ప్థలాన్ని సందర్శిం చి, ప్రమాదానికి దారితీసిన పరిస్థితులపై దర్యాప్తుకు ఆదేశించారు. ఈ రవాణా విమానం బౌఫారిక్‌నుంచి టిండౌఫ్‌కు వెళ్తోంది. రష్యాలో తయారైన ఈ ఐఐ76 మిలిటరీ రవాణా విమానం 1970నుంచి ఉపయోగంలో ఉంది. అంతేకాదు సేఫ్టీపరంగా మంచి రికార్డు కూడా ఉంది. అలీరియాలో తరచూ విమాన ప్రమాదాలు జరుగుతున్నప్పటికీ ఇంత భారీ సంఖ్యలో చనిపోవడం ఇటీవలి కాలంలో ఇదే మొదటిసారి.

Comments

comments