Search
Wednesday 17 October 2018
  • :
  • :

కొండచరియలు విరిగిపడి 31 మంది మృతి!

At least 31 kills Landslide in Eastern Uganda

కంపాల: తూర్పు ఉగాండాలోని మౌంట్‌ ఎల్గాన్‌ లో కొండచరియలు విరిగిపడిన ఘటనలో 31 మంది మృత్యువాత పడ్డారు. ఈ మేరకు డిజాస్టర్‌ ప్రిపేర్డ్‌నెస్‌ కమిషనర్‌ మార్టిన్‌ ఓవోర్‌ ఒక ప్రకటన ద్వారా వెల్లడించారు. పదుల సంఖ్యలో ఇళ్లు ధ్వంసమైనట్లు సమాచారం. కాగా, కొండచరియలు విరిగిపడిన సమయంలో చాలామంది మార్కెట్‌ ప్రాంతంలో ఉండడంతో అధిక మొత్తంలో ప్రాణ నష్టం జరిగింది. ఒక్కసారిగా విరిగిపడిన కొండచరియల వల్ల భారీ బండరాళ్లు అక్కడి నదిలో పడ్డాయి. దాంతో నది ఒడ్డు కోసుకుపోవడంతో ప్రజలు నీటి ప్రవాహంలో కొట్టుకుపోయారని మార్టిన్‌ వెల్లడించారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

At least 31 kills Landslide in Eastern Uganda.

Telangana Breaking News

Comments

comments