Home అంతర్జాతీయ వార్తలు కెన్యా ను ముంచెత్తిన వరదలు: 38 మంది మృతి

కెన్యా ను ముంచెత్తిన వరదలు: 38 మంది మృతి

At least 38 killed after dam burst in Kenya

కెన్యా: కెన్యాలో బుధవారం రాత్రి కురిసిన వర్షానికి వివిధ ప్రాంతాల్లోని నదుల పొంగి ప్రవహించటంతో భారీ నష్టం సంభవించింది. సోలాయ్‌లోని పటేల్‌ డ్యామ్‌ పొంగి వందలాది ఇళ్లు కొట్టుకు పోయాయి. రిజర్వాయర్‌ సమీపంలోని పొలాలు కూడా వరద నీటిలో మునిగాయి. రిఫ్ట్‌ లోయలోని డ్యామ్‌ పొంగి 38మంది మృతి చెందారు.  అనేక నివాస గృహాలు వరదల్లో ధ్వంసమైనట్టు గురువారం ఆ దేశ విపత్తు ప్రతిస్పందన శాఖ అధికారులు తెలిపారు. దీనిపై అధికారి గిడోన్‌ కిబుంజా మాట్లాడుతూ… ఇప్పటికీ 38 మృతదేహాలను వెలికి తీశామని, చాలా మంది వరద దాటికి కొట్టుకు పోయారు అని ఆయన అన్నారు. ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని, ఈ వరద దాటికి ఓ గ్రామం మొత్తం కొట్టుకుపోయింది’ అని ఆయన తెలిపారు.అత్యవసర వైద్య చికిత్స బాధ్యతలు కెన్యా రెడ్‌క్రాస్‌ సంస్థ చూసుకుంటోందని అధికారులు తెలిపారు.