Search
Thursday 20 September 2018
  • :
  • :
Latest News

ఘోర రోడ్డుప్రమాదం.. 8మంది దుర్మరణం

Road-Accident

ముంబయి: మ‌హారాష్ట్రలోని మ‌థాడే వాస్తిలో సోమవారం ఉదయం ఘోర రోడ్డుప్రమాదం చోటు చేసుకుంది. వేగంగా వ‌చ్చిన ట్ర‌క్కు అదుపు త‌ప్పి బ‌స్సును ఢీకొన‌డంతో 8 మంది అక్కడికక్కడే మృతిచెందారు. మరో 13 మంది తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. దీంతో స్థానికులు వెంట‌నే క్ష‌త‌గాత్రుల‌ను చికిత్స కోసం సమీపంలోని ఆస్పత్రికి త‌ర‌లించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు.  పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

At least 8 killed and 13 Injured in a bus collision truck at Mathade Wasti.

Comments

comments