Home సినిమా థ్రిల్లర్, మర్డర్ మిస్టరీ మూవీ

థ్రిల్లర్, మర్డర్ మిస్టరీ మూవీ

nara

ఫ్రెండ్స్ మూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై నారా రోహిత్, జగపతిబాబు నటిస్తున్న సినిమా ‘ఆటగాళ్లు’. పరుచూరి మురళీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను వాసిరెడ్డి రవీంద్రనాథ్, వాసిరెడ్డి శివాజీ ప్రసాద్, మక్కెన రాము, వడ్లపూడి జితేంద్ర నిర్మిస్తున్నారు. హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో ఈ సినిమా ట్రైలర్‌ను శేఖర్ కమ్ముల విడుదల చేశారు. ఈ సందర్భంగా జగపతిబాబు మాట్లాడుతూ “ఇదొక థ్రిల్లర్, మర్డర్ మిస్టరీ మూవీ. పరుచూరి మురళి ట్రైలర్‌ను అద్భుతంగా కట్ చేశాడు. ప్రేక్షకులను థ్రిల్ చేసే చిత్రమిది”అని అన్నారు. నారా రోహిత్ మాట్లాడుతూ “ఇలాంటి జోనర్ మూవీ చేయడం నాకు కొత్త అనుభవాన్ని ఇచ్చింది. సాయికార్తీక్ అద్భుతమైన మ్యూజిక్, విజయ్ సి.కుమార్ చక్కటి విజువల్స్ ఇచ్చారు”అని తెలిపారు. దర్శకుడు పరుచూరి మురళి మాట్లాడుతూ “ప్రేక్షకులందరికీ ఈ సినిమా నచ్చుతుంది. జగపతిబాబుతో ఇది వరకు పనిచేశాను. కానీ నారా రోహిత్‌తో తొలిసారి కలిసి పనిచేశాను. సినిమా అవుట్‌పుట్ కోసం ఎక్కడా రాజీ పడలేదు”అని చెప్పారు. నిర్మాత వాసిరెడ్డి రవీంద్రనాథ్ మాట్లాడుతూ “సినిమా అంతా మైండ్‌గేమ్‌తో ఆసక్తికరంగా ఉంటుంది. నటన, డైలాగ్స్ పరంగా జగపతిబాబు, నారా రోహిత్ ఆట ఆడుకున్నారు. సినిమా చాలా బాగా వచ్చింది. జగపతిబాబు తొలిసారి లాయర్ పాత్రలో నటించిన చిత్రమిది”అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీతేజ్, ఫణి, గోపి తదితరులు పాల్గొన్నారు.