Search
Friday 21 September 2018
  • :
  • :
Latest News

బిజెపి ఆఫీసుకు వాజ్‌పేయి భౌతికకాయం

Atal Bihari Vajpayee Dead Body Shifted to BJP Office

ఢిల్లీ : భారతరత్న , మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి భౌతికకాయాన్ని ఢిల్లీలోని బిజెపి ప్రధాన కార్యాలయానికి తరలించారు. ఆయన పార్థివదేహానికి ప్రధాని నరేంద్రమోడీతో పాటు బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా, కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్, యుపి సిఎం యోగి ఆదిత్యనాథ్, కేంద్ర మంత్రులు, ఇతర బిజెపి అగ్రనేతలు నివాళులు అర్పించారు. వాజ్‌పేయిని కడసారి చూసేందుకు పార్టీ కార్యకర్తలు, అభిమానులు పెద్దఎత్తున తరలివస్తున్నారు. ప్రజల సందర్శనార్థం వాజ్‌పేయి భౌతికకాయాన్ని మధ్యాహ్నం ఒంటి గంట వరకు బిజెపి కార్యాలయంలో ఉంచుతారు. అనంతరం ఆయన అంతిమ యాత్ర ప్రారంభమవుతుంది. సాయంత్రం నాలుగు గంటలకు రాష్ట్రీయ స్మృతి స్థల్ వద్ద అధికారిక లాంఛనాలతో ఆయన అంత్యక్రియలు జరుగుతాయి.

Atal Bihari Vajpayee Dead Body Shifted to BJP Office

Comments

comments