Home జాతీయ వార్తలు వాజ్‌పేయి పార్థివదేహానికి సిఎం కెసిఆర్ నివాళి

వాజ్‌పేయి పార్థివదేహానికి సిఎం కెసిఆర్ నివాళి

Atal Bihari Vajpayee dies at 93Years old

హైదారాబాద్ : మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి మృతి పట్ల  తెలంగాణ సిఎం కెసిఆర్ తన ప్రగాఢ సంతాపాన్ని తెలియ జేశారు. ప్ర‌ధానిగా విలువ‌ల‌తో కూడిన రాజ‌కీయాల‌ను న‌డిపి దేశానికే కాక యావ‌త్ ప్ర‌పంచానికే ఆద‌ర్శంగా నిలిచిన వాజ్‌పేయి మృతి తీర‌ని లోట‌ని సిఎం కెసిఆర్  అన్నారు. మానవతావాది, కవి, సిద్ధాంతకర్త, మంచి వక్త, నిరాడంబరుడు, నమ్మిన సిద్ధాంతం కోసం జీవితాంతం వరకు పనిచేసిన వాజ్‌పేయి ఆత్మ‌కి శాంతి చేకూరాల‌ని సిఎం కెసిఆర్ అన్నారు.