Home జాతీయ వార్తలు వాజ్‌పేయి ఆరోగ్య పరిస్థితి విషమం…

వాజ్‌పేయి ఆరోగ్య పరిస్థితి విషమం…

Atal Bihari Vajpayee stable, responding to treatment: New bulletin

ఢిల్లీ: బిజెపి  పార్టీ కురువృద్ధుడు, మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి  కొద్ది రోజుల క్రితం  వృద్ధాప్య సమస్యలతో తీవ్ర అస్వస్థతకు గురికావడంతో ఆయనను ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే తాజాగా ఆయన ఆరోగ్యం మరింత క్షీణించడంతో పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో బిజెపి అగ్రనేతలు అధికారిక కార్యక్రమాలను రద్దు చేస్తున్నట్లు సమాచారం. ఇవాళ ఉదయం బిజెపి జాతీయాధ్యక్షుడు అమిత్ షా ఎయిమ్స్ ఆసుపత్రికి వెళ్లి వాజ్‌పేయిని పరామర్శించారు. తాజాగా భారత ప్రధాని మోడీ ఎయిమ్స్‌కు చేరుకున్నారు. వాజ్‌పేయికి అందిస్తున్న చికిత్స వివరాలను వైద్యులను అడిగి తెలుసుకున్నారు.