Search
Wednesday 21 November 2018
  • :
  • :
Latest News

దళితులపై దాడులకు నిరసన

Dalit

నిర్మల్ టౌన్: దళితులపై దాడులకు నిరసనగా ఈనెల 22న హైదరాబాద్‌లోని ఇందిరాపార్క్ వద్ద ధర్నాను నిర్వహిస్తున్నట్లు నాయకులు తెలిపారు. ఇందులో సిపిఐ, సిపిఎం, కెవిపిఎస్, ఆర్‌పిఐ దళిత హక్కుల పోరాట సమితి, వ్యవసాయకార్మిక సంఘాలు, దళిత సంఘాలు కలిసి ధర్నా నిర్వహిస్తున్నారన్నారు. ఇందులో భాగంగా ధర్నా విజయవంతంకోసం జిల్లా కేంద్రంలోని టీఎన్జీవోస్ భవనంలో శుక్రవారం ఆయా పార్టీల ఆధ్వర్యంలో రౌండ్ టెబుల్ సమావేశం నిర్వ హించారు.

ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత దళితులపై దాడులు పెరిగాయన్నారు. దేశంలో దళితులకు రక్షణ లేకుండా పోయిందన్నారు. గోమాంసం తింటున్నారనే పేరిట దళితులపై దాడులు చేస్తున్నారన్నారు. దాడులను ఆరికట్టాలని నిర్వహించే ధర్నాకు దళిత, ప్రజా సంఘలు, వామప క్షాలు, అభ్యుదయ వాదులు పెద్ద సంఖ్యలో హజరై విజయవంతం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఐ ఎంఎల్ న్యూడెమెక్రసి నాయ కులు శంకర్, సీపీఐ నాకులు ఎస్‌ఎన్‌రెడ్డి, సీపీఎం నాయకులు గౌతం కృష్ణ, అంబేద్కర్ యువజన సంఘం నాయకులు జగన్‌మోహన్, ఆయా సంఘాల నాయకులు గౌతం పింగ్లె, గిరిధర్, రాజేశ్వర్, డెవిడ్, దుర్గం నూతన్‌కుమార్, రాములు, తదితరులు పాల్గొన్నారు.

Comments

comments