Search
Sunday 23 September 2018
  • :
  • :
Latest News

జిహెచ్‌ఎంసి సిబ్బందిపై దాడి 

 Attack on GHMC Employees in Hyderabad

కెపిహెచ్‌బి కాలనీ డివిజన్ గోపాల్ నగర్‌లో  గతంలో కూల్చివేసిన అక్రమ నిర్మాణాన్ని తిరిగి  కొనసాగిస్తున్నారన్న  సమాచారంతో అడ్డుకోవడానికి వెళ్ళిన మూసాపేట సర్కిల్ టౌన్‌ప్లానింగ్ సిబ్బందిపై  భవన నిర్మాణదారుల అనుచరులు దాడి చేశారు. ఈ దాడిలో ఇద్దరు చైన్‌మెన్‌లకు   తీవ్ర గాయాలయ్యాయి. గోపాల్ నగర్‌లోలో ఎలాంటి అనుమతి లేకుండా నిర్మాణాల చేపట్టడంతో గత రెండు నెలల క్రితం జీహెచ్‌ఎంసీ విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ సిబ్బంది కూల్చివేశారు.ఈ అక్రమ నిర్మాణాలపై ఉదాసీనంగా వ్యవహరించారని నిర్ధారించిన జీహెచ్‌ఎంసీ కమిషనర్ టౌన్‌ప్లానింగ్ సెక్షన్ అధికారిని సస్పెండ్ చేయడంతోపాటు టౌన్‌ప్లానింగ్ ఎసీపీని బదిలీచేసిన విషయంతెలిసిందే. ఇదిలా ఉండగా అక్రమనిర్మాణదారులు కూల్చివేతలను నిలిపివేయాలని కోరుతూ కోర్టును ఆశ్రయించారు. దీంతో కోర్టు యాధాతధస్థితిని కొనసాగించాలని ఉత్తర్వులు ఇచ్చింది. యాధా తధస్థితిని కొనసాగించాలన్న కోర్టు ఉత్తర్వులను దిక్కరించి నిర్మాణం చేపడుతున్నారన్న పిర్యాదు మేరకు టౌన్‌ప్లానింగ్ సెక్షన్ అధికారి ఆదేశాల మేరకు చైన్‌మెన్‌లు కుమార్, మాణిక్యం కొంతమంది సిబ్బందితో వెళ్ళి అడ్డుకోవడానికి యత్నించారు. భవనం వద్దనున్న సెక్యూరిటీ గార్డుతోపాటు బిల్డర్ అనుచరులు జీహెచ్‌ఎంసీ సిబ్బందితో వాగ్వివాదానికి దిగారు. సిబ్బందిపై కర్రతో దాడి చేయడంతో వారికి గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న టౌన్‌ప్లానింగ్ ఎసీపి దాసు, టీపిఎస్ సత్యనారాయణలు సంఘటనా స్థలానికి వెళ్ళి సిబ్బందిని ఆసుపత్రికి తరలించి మియాపూర్ పోలీసులకు పిర్యాదు చేశారు. తమ విదులకు ఆటంకం కలిగించి దాడిచేసిన బిల్డర్ అనుచరులపై చర్యలు తీసుకోవాలని మునిసిపల్ ఉద్యోగుల సంఘం డిమాండ్‌చేసింది.
దొంగలనుకుని వెంబడించారుః బిల్డర్ శ్రీనివాస్
కోర్టు ఉత్తర్వుల మేరకు తాము ఎలాంటి నిర్మాణాలు చేపట్టడం లేదని బిల్డర్ స్వప్న శ్రీనివాస్ తెలిపారు. భవనం వద్ద సెక్యూరిటీ గార్డులు మాత్రమే ఉన్నారని చెప్పారు. తమ భవనంలో ఉన్న నీటి మోటార్లను విప్పి తీసుకెళుతుండగా దొంగలనుకుని సెక్యూరిటీ గార్డు వెంబడించి పట్టుకున్నారని, తోపులాటలో ఇరువురికి స్వల్ప గాయాలు మాత్రమే అయ్యాయని తెలిపారు.

Comments

comments