Home అంతర్జాతీయ వార్తలు లండన్‌లో కారల్ మార్క్స్ సమాధిపై దాడి

లండన్‌లో కారల్ మార్క్స్ సమాధిపై దాడి

 

హైదరాబాద్: కమ్యూనిస్టు నేత కారల్ మార్క్స్ సమాధిపై దాడి జరిగింది. స్మశాన ట్రస్టు నిర్వహకుడు దుంగావెల్ మీడియాతో మాట్లాడారు. మార్క్స్ 1949 లండన్ కు చేరుకున్నాడని తుది శ్వాస విడిచేవరకు అక్కడి ఉన్నాడని తెలిపారు. లండన్‌లోని హైగేట్ స్మశానంలో ఆయన సమాధి ఉంది. సమాధిపై చెక్కి ఉన్న కారల్ మార్క్స్ పేరు సుత్తి దెబ్బలతో దాడి చేశారు. ఆయన పేరు పూర్తిగా చెరిపివేసినట్టుగా మారింది. ఈ దాడిపై అనేక మంది మేధావులు మండిపడుతున్నారు. గతంలో ఎన్నోసార్లు మార్క్స్ సమాధిపై  పెట్రో బాంబు, పెయిటింగ్ బాంబు చేశారన్నారు. అనేక దాడులకు తట్టుకొని నిలిచిన చరిత్ర మార్క్స్  సమాధికి ఉందన్నారు. గతంలో ఉన్నవిధంగా తేవడం సాధ్యం కాదన్నారు.

 

Attack on Karl Marx Tomb in London