Home జాతీయ వార్తలు స్వామి అగ్నివేష్‌పై దాడి

స్వామి అగ్నివేష్‌పై దాడి

Attack on Swami Agnivesh at Jharkhand

రాంచీ : సామాజిక కార్యకర్త స్వామి అగ్నివేష్‌పై బిజెపి, విహెచ్‌పి, ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్తలు దాడి చేశారు. జార్ఖండ్‌లోని పాకూర్‌లో మంగళవారం ఈ ఘటన చోటు చేసుకుంది. లిట్టిపాడలో జరిగే ఓ కార్యక్రమం కోసం ఆయన వచ్చారు. అగ్నివేష్ వచ్చిన విషయం తెలుసుకున్న బిజెపి కార్యకర్తలు ఆయన బస చేసిన హోటల్ వద్ద ఆందోళనకు దిగారు. ఆయన హోటల్ నుంచి బయటకు రాగానే దాడి చేసి ఆయన బట్టలను చించివేశారు. అగ్నివేష్ క్రిస్టియన్ మిషనరీ సంస్థలతో చేతులు కలిపి గిరిజనులను క్రిస్టియన్లుగా మారుస్తున్నారని వారు ఆరోపించారు. దాడి అనంతరం అగ్నివేష్ మీడియాతో మాట్లాడారు. హింసకు తాను వ్యతిరేకమని ఆయన పేర్కొన్నారు. తనపై దాడి ఎందుకు చేశారో అర్ధం కావడం లేదని తెలిపారు.

Attack on Swami Agnivesh at Jharkhand