Search
Wednesday 21 November 2018
  • :
  • :
Latest News

మంత్రి కాన్వాయ్‌పై కోడిగుడ్ల దాడి

RADHA

భువనేశ్వర్ : కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి రాధా మోహన్‌సింగ్ కాన్వాయ్‌పై శనివారం కోడిగుడ్ల దాడి జరిగింది. యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు ఈ దాడికి పాల్పడినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. భువనేశ్వర్‌లో జరిగిన ఈ ఘటనలో ఐదుగురిని పోలీసులు అరెస్టు చేశారు. భువనేశ్వర్‌లోని ఒడిశా గెస్ట్‌హౌస్ ఎదుట ఈ దాడి జరిగింది. మధ్యప్రదేశ్‌లో రైతులపై కాల్పులకు నిరసనగా గెస్ట్‌హౌస్ ఎదుట కాంగ్రెస్ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. ఇదే సమయంలో ఇక్కడికొచ్చిన మంత్రి కాన్వాయ్‌పై కోడిగుడ్లతో దాడి చేశారు. అయితే మంత్రి కాన్వాయ్‌పై దాడిని బిజెపి తీవ్రంగా ఖండించింది.

Comments

comments