Search
Tuesday 20 November 2018
  • :
  • :
Latest News

పత్తి పంటపై పందుల దాడి

pig

 వందలాది ఎకరాల్లో దెబ్బతిన్న పత్తి పంటలు 

పంటలను కాపాడాలని అటవీ కార్యాలయాన్ని ముట్టడించిన రైతులు 

జిల్లా వ్యాప్తంగా ఒకే షూటర్ 

చర్యలు తీసుకోవాలని రైతుల వేడుకోలు

రాత్రనక పగలనకా కాయకష్టం చేసి, ఆరుగాలం శ్రమించి పంటలను పండిస్తుండగా రై తులు అడవి పందుల బారి నుండి పంటను కాపాడుకోలేక తీవ్ర నష్టాల పాలవుతున్నారు. పంట పొలా ల్లో సాగు చేసిన పంటలను అడవి పందుల దాడి నుంచి ఎలా కాపాడుకోవాలో తెలియక ఆందోళన చెందుతున్నారు.  జిల్లా వ్యాప్తంగా పందులను వేటాడేందుకు ప్రభుత్వం ఒక్క షూటర్‌నే నియమించగా ఫలితం కానరావడం లేదు. వేలాది రూపాయలు ఖ ర్చు చేసి, పంటలు పండిస్తే అడవి పందులతో తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుంద ని, పంటలను కాపాడుకునేందు కు రా త్రుల్లో  జాగారం చేయాల్సి వ స్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మంచిర్యాల, ఆసిఫాబాద్ జిల్లాల్లోని అటవీ ప్రాం తాలకు సమీపంలో ఉన్న మండల రైతులు ఈ ఏడా ది పత్తి పంటలు అధి క విస్తీర్ణంలో  సాగు చేస్తూ అడ వి పందుల బారి నుం డి పంటలను కాపాడుకోలేకపోతున్నారు. జిల్లాలోని జన్నారం, దండేపల్లి, చె న్నూర్, వేమనపల్లి, కోటపల్లి, నెన్నెల భీమిని,  కన్నెపల్లి, ఆసిఫాబాద్ జిల్లాలోని కెరమెరి, వాంకిడి, బెజ్జుర్, కౌటాల, తిర్యాణి, మండలాల్లో వందలాది ఎకరాల్లో పత్తి పంటలను అడవి
పందులు ధ్వంసం చేశాయని రైతులు ఆందోళన చెందుతున్నారు. దెబ్బతిన్న పంటలకు ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించాలంటూ జన్నారంలో రైతులు ఎఫ్‌డిఓ కార్యాలయాన్ని ముట్టడించా రు. అంతే కాకుండా సిపి ఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ ఆధ్వర్యంలో రాస్తారోకో చేపట్టారు. అడవి పందుల దాడిలో దెబ్బతిన్న పంటలను వ్యవసాయశాఖ అధికారులు పరిశీలించి అంచనా వేసి, నష్టపరిహారం చెల్లించాలని రైతులు కోరుతున్నారు. పంటలను కాపాడుకునేందుకు పొలంచుట్టూ రంగు రంగుల చీరలను కట్టడం వలన పందులు రావడం లేదని, అయితే పత్తి చేనుల చుట్టూ చీరలను కట్టడం కష్టతరంగా మారిందని రైతులు వాపోతున్నారు. ఒక ఎకరానికి అయితే ఏదో విధంగా చీరలు కట్టవచ్చునని ఐదు, పది ఎకరాల్లో పత్తి పంటలు వేస్తే చీరలను ఎలా కడుతామని రైతులు అంటున్నారు. పత్తి పంటలపై పందులు గుంపుగా విరుచుకుపడడంతో రైతులు ఎదుర్కోలేక తల బాదుకుంటున్నారు. ఒక్కో రైతుకు చెందిన దాదాపు ఐదు ఎకరాల పంటలను నాశనం చేస్తుండగా వారి పరిస్థితులు ఆగమ్యగోచరంగా మారాయి. పెట్టిన పెట్టుబడులు వచ్చే పరిస్థితి లేకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. అడవి పందులు దాడి చేయగానే సంబంధిత వ్యవసాయ అధికారులు పత్తి చేనులను పరిశీలించి పరిహారం అందే విధంగా చూడాల్సి ఉండగా అధికారులు నిర్లక్షం వ్యవహరిస్తున్నారని రైతులు వాపోతున్నారు. తెలంగాణ వ్యాప్తంగా పంటలను నాశనం చేసే అడవి పందులను హతమార్చేందుకు ఫైరింగ్‌లో నిపుణుడైన నవాబ్ అనే వ్యక్తిని అధికారికంగా నియమించినప్పటికీ అందుబాటులో ఉండడం లేదని వాపోతున్నారు. గతంలో అడవి పందులను వేటాడేందుకు రైతులు పంట చేనుల వద్ద విద్యుత్ తీగలతో విద్యుత్ షాక్‌లను ఏర్పాటు చేయగా తీగలకు తగిలి ఎంతో మంది రైతులు ప్రాణాలను కోల్పోవడంతో రైతులు విద్యుత్‌షాక్‌లు అమర్చడం తగ్గించారు. గత ఏడాది జన్నారం మండలంలోని మహ్మదాబాద్ సమీపంలో ఒక రైతు విద్యుత్ షాక్‌ను ఏర్పాటు చేయగా అదే గ్రామానికి చెందిన మరో రైతు పంట పొలానికి నీరు పెట్టేందుకు వెళ్లి విద్యుత్ తీగలకు తగిలి అక్కడికక్కడే మృతి చెందాడు. మంచిర్యాల, ఆసిఫాబాద్ జిల్లాల్లోని 75 శాతం పంటలను అడవి పందులు, ఎలుగుబంట్లు నాశనం చేశాయని రైతులు వాపోతున్నారు. ఇప్పటికైనా వ్యవసాయశాఖ అధికారులు అడవి పందుల దాడిలో దెబ్బతిన్న పంటలను పరిశీలించి నష్టపరిహారం అందించాలని రైతులు కోరుతున్నారు.

Comments

comments