Home జయశంకర్ భూపాలపల్లి బావపై బావమరిది కత్తితో దాడి

బావపై బావమరిది కత్తితో దాడి

Attack-with-Knife-on-Man

జయశంకర్ భూపాలపల్లి: బావపై బావమరిది కత్తితో దాడికి పాల్పడిన దారుణ ఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మంగపేట మండలం కమలాపురంలో గురువారం చోటుచేసుకుంది. ఈ హత్యాయత్నంలో బాలిశెట్టి గోపయ్య అనే వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. గోపయ్యపై బావమరిది కత్తితో విచక్షణారహితంగా దాడికి తెగబడ్డాడు. దీంతో గోపయ్య గోంతుతో పాటు పలు చోట్ల తీవ్ర గాయాలయ్యాయి. తీవ్ర రక్తస్రావంతో కొట్టుమిట్టాడుతున్న గోపయ్యను స్థానికులు ఆస్పత్రికి తరలించారు. అతడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే బావ, బావమరిదిల మధ్య ఈ ఘర్షణ ఎందుకు జరిగిందనే తెలియాలంటే మాత్రం గోపన్న నోరు తెరిస్తే గానీ తెలియదు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Attack with Knife on Man in Jayashankar Bhupalpally District.