Home ఎడిటోరియల్ భారత్‌లో పత్రికా స్వేచ్ఛ!

భారత్‌లో పత్రికా స్వేచ్ఛ!

Attacks on regional journalists

 

నేషనల్ మీడియాతో పాటు ప్రాంతీయ పాత్రికేయులపైనా దాడులు జరుగుతున్నాయని, గ్రామీణ ప్రాంతాల్లో పని చేస్తున్న జర్నలిస్టులపై ఈ దాడులు అధికంగా జరుగుతున్నాయని నివేదిక వెల్లడించింది. భారత్‌కు కేటాయించిన ర్యాంకును బట్టి చూస్తే పత్రిక స్వేచ్ఛ అనేది భారత్‌లో లేదు అనుకోవాల్సి వస్తుంది అని ఆ సంస్థ తన రిపోర్ట్‌లో రాసింది. ప్రస్తుతం భారత్‌లో జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల వేళ జర్నలిస్ట్‌లకు ప్రమాదం మరింత ఎక్కువగా ఉందని చెప్పింది సంస్థ. కశ్మీరు వంటి ప్రాంతాల్లో విదేశీ పాత్రికేయులను అసలు అడుగు పెట్టనీయట్లేదని, అక్కడ పని చేయడం జర్నలిస్టులకు చాలా కష్టంగా మారిందని నివేదిక చెప్పింది. 

భారత్‌లో పత్రికా స్వేచ్ఛ రోజురోజుకు దిగజారిపోతున్నదని ఇటీవల విడుదల అయిన “రిపోర్టర్స్ వితౌట్ బోర్డర్స్‌” అనే స్వచ్ఛంద సంస్థ నివేదిక ద్వారా తెలుస్తోంది. 2019 సంవత్సరానికి పత్రికా స్వేచ్ఛ అంశంలో 180 దేశాలకు ర్యాంకులను ఈ సంస్థ కేటాయించగా మన దేశానికి 140వ ర్యాంకు లభించింది. భారత్‌లో పాత్రికేయులపై దాడులు రోజురోజుకూ పెరిగిపోతున్నాయని, పోలీసులు, మావోయిస్టులు, నేర ముఠాలు, అవినీతి రాజకీయ నాయకులు హింసాత్మక దాడులు చేస్తున్నారని, జర్నలిస్ట్‌లను బెదిరిస్తున్నారని ఈ సంస్థ తన నివేదికలో తెలిపింది. ‘వరల్డ్ ప్రెస్ ఫ్రీడం ఇండెక్స్ 2019’ పేరుతో విడుదల చేసిన ఈ నివేదికలో పలు విషయాలను కూడా ఈ సంస్థ బహిర్గతం చేసింది.

భారత్‌లో 2018వ సంవత్సరంలో ఆరుగురు జర్నలిస్టులను వారు జర్నలిజం వృత్తిలో భాగంగా చేసిన కృషి కారణంగా దారుణంగా హత్య చేశారని ఈ సంస్థ చెప్పింది. మరో జర్నలిస్టు మృతి అంశంలో అనేక అనుమానాలు ఉన్నాయని చెప్పుకొచ్చింది. 2018 సంవత్సరంలో దేశ వ్యాప్తంగా మొత్తం ఏడుగురు జర్నలిస్టులు హత్యకు గురి కాగా వారిలో గౌరీ లంకేష్ అనే జర్నలిస్ట్ హత్యపై ఆందోళనలు రేకెత్తాయని, హత్య చేసిన వారంతా కేంద్రంలోని అధికార బిజెపి మద్దతుదారులేనన్న ఆరోపణలున్నాయని, పోలీసుల అరాచకాలు, రాజకీయ నాయకుల వేధింపులు, మావోయిస్టుల దారుణాలు జర్నలిస్టులను ఒత్తిడికి గురి చేస్తున్నాయని, దీంతో జర్నలిస్టులు స్వేచ్ఛగా వార్తలు రాయలేకపోతున్నారని ఆర్‌ఎస్‌ఎఫ్ నివేదిక పేర్కొంది. ప్రపంచ దేశాలతో పోల్చుకుంటే మన దేశంలో స్వేచ్ఛ అనేది రోజురోజుకూ కుంచించుకుపోతోందనే సూచనలే కనిపిస్తున్నాయి. పత్రికా స్వేచ్ఛలో ప్రస్తుతం భారత్ ర్యాంక్ ఈ విషయాన్ని స్పష్టం చేస్తోంది. జర్నలిస్టులపై దాడులు, యాజమాన్యాలపై ఒత్తిడులు ఇందుకు కారణం.

నేషనల్ మీడియాతో పాటు ప్రాంతీయ పాత్రికేయులపైనా దాడులు జరుగుతున్నాయని, గ్రామీణ ప్రాంతాల్లో పని చేస్తున్న జర్నలిస్టులపై ఈ దాడులు అధికంగా జరుగుతున్నాయని నివేదిక వెల్లడించింది. భారత్‌కు కేటాయించిన ర్యాంకును బట్టి చూస్తే పత్రిక స్వేచ్ఛ అనేది భారత్‌లో లేదు అనుకోవాల్సి వస్తుంది అని ఆ సంస్థ తన రిపోర్ట్‌లో రాసింది. ప్రస్తుతం భారత్‌లో జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల వేళ జర్నలిస్ట్‌లకు ప్రమాదం మరింత ఎక్కువగా ఉందని చెప్పింది సంస్థ. కశ్మీరు వంటి ప్రాంతాల్లో విదేశీ పాత్రికేయులను అసలు అడుగు పెట్టనీయట్లేదని, అక్కడ పని చేయడం జర్నలిస్టులకు చాలా కష్టంగా మారిందని నివేదిక చెప్పింది. 2018 సంవత్సరంలో ఇదే రిపోర్ట్‌లో భారత్‌కు 138వ ర్యాంకు దక్కింది. నార్వే మూడోసారి తొలి ర్యాంకును నిలబెట్టుకోగలిగింది. ఫిన్లాండ్, స్వీడన్, నెదర్లాండ్స్ వరుసగా రెండు, మూడు, నాలుగు స్థానాల్లో నిలిచాయి. భారత్‌కు పొరుగు దేశాలైన పాకిస్థాన్ 142వ ర్యాంకులో చేరగా, బంగ్లాదేశ్ 150వ ర్యాంకు వచ్చింది.

చివరి నాలుగు ర్యాంకులు విషయానికి వస్తే.. తుర్క్‌మెనిస్థాన్ 180వ ర్యాంకు, ఉత్తర కొరియా 179వ ర్యాంకు, చైనా 177వ ర్యాంకు, వియత్నాం 176వ ర్యాంకులో ఉన్నాయి. భారత్‌లో పత్రికా స్వేచ్ఛ క్షీణించిందని, భారత్‌లో హిందుత్వకు వ్యతిరేకంగా మాట్లాడితే దాడులేనని, పత్రికా స్వేచ్ఛ గత ఏడాదితో పోలిస్తే రెండు స్థానాలు దిగజారిందని ఫ్రాన్స్ కేంద్రంగా పని చేస్తున్న “రిపోర్టర్స్ వితౌట్ బోర్డర్స్‌” తెలిపింది. పాత్రికేయులపై దాడులు చేస్తున్న వారిలో ఎక్కువ మంది భాజపా మద్దతుదారులేనని ఆరోపించింది కూడా. హిందుత్వకు వ్యతిరేకంగా గళమెత్తుతున్న పాత్రికేయులే లక్ష్యంగా సామాజిక మాధ్యమాల్లో సమన్వయంతో కూడిన ద్వేష ప్రచారం జరుగుతోందని వెల్లడించింది. వారి లక్ష్యం మహిళలే అయితే ఇది మరింత తీవ్రంగా ఉంటోందని కుండబద్దలు కొట్టింది. అదే విధంగా ప్రపంచ వ్యాప్తంగా పాత్రికేయుల పట్ల శత్రుత్వ వైఖరి పెరుగుతోందని ప్రభుత్వాలు మీడియాపై పట్టును పెంచుకుంటున్నాయి.

గ్రామీణ ప్రాంతాల్లో పని చేసే ఇంగ్లీషేతర భాషల పాత్రికేయులకు ముప్పు ఎక్కువ. దక్షిణాసియాలో మరీ అధ్వాన పరిస్థితి నెలకొని ఉంది. దక్షిణాసియాలో పత్రికా స్వేచ్ఛకు ఏటికేడూ తూట్లు పడుతున్నాయి. ఇంతకు ముందుతో పోలిస్తే పాకిస్థాన్ మూడు స్థానాలు దిగజారి 142వ స్థానం, బంగ్లాదేశ్ నాలుగు స్థానాలు దిగజారి 150, చైనా మరో మెట్టు దిగి 177వ స్థానంలో నిలిచాయి. తుర్కెమెనిస్థాన్ 180వ ర్యాంకులో నిలిచింది. ఉత్తరకొరియా ఒక్క స్థానం మెరుగుపడి 179 ర్యాంకులోకి వచ్చింది. అయితే ఈ మధ్య ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మద్దతుదారులు జర్నలిస్టులపై దాడులకు పాల్పడ్డారని, ఇది కూడా పత్రిక స్వేచ్ఛను మరింత అధమ స్థాయిలోకి నెట్టడానికి కారణమని సర్వేలో పేర్కొన్నారు. పోలీసుల అరాచకాలు, మావోయిస్టుల దారుణాలు, రాజకీయ నాయకుల వేధింపులు జర్నలిస్టులను ఒత్తిడిలోకి నెడుతున్నాయని, దీంతో స్వేచ్ఛగా వార్తలు రాయలేకపోతున్నారని ఆర్‌ఎస్‌ఎఫ్ నివేదికలో పేర్కొన్నారు.

Attacks on regional journalists