Search
Wednesday 21 November 2018
  • :
  • :

మార్బుల్ మెరుపులు

Attractive marbles that enhance the beauty of the home

సొంతింటి కలను సాకారం చేసుకొనేందుకు ఎంతగా ఆసక్తి చూపుతారో.. ఆ ఇంటిని తమ అభిరుచులకు అనుగుణంగా నిర్మించుకొనేందుకు అంతే ప్రాధాన్యమిస్తారు చాలామంది. ఇంటి యజమానులు తమ ఇష్టానికి అనుగుణంగా నిర్మించుకున్న కలల సౌధాన్ని మరింత సౌందర్యంగా, చూడముచ్చటగా అలంకరించుకోవడంలోనూ ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు. వంటగది, పడకగది, లివింగ్ రూం, చిన్నారుల గది ఇలా.. ఎక్కడ ఏ రంగు వేయాలి. ఎలాంటి ఫ్లోరింగ్ ఎంచుకోవాలనే కాకుండా మనసుకు హత్తుకొనేవిధంగా ఫర్నిచర్ కొనాలనుకుంటారు. దీనికోసం ఎంతో ఖర్చు చేయాలనుకుంటారు. అలాగే తమ అభిరుచులకనుగుణంగా ఇంట్లో ఫ్లోరింగ్ మార్బుల్స్ వేసుకోవాలనుకుంటారు. ఈ క్రమంలో కొన్ని ఇళ్లలో ఏర్పాటు చేసిన ఫ్లోరింగ్‌లను గమనిస్తే.. ఇంత చక్కగా అలంకరించుకోవచ్చా అనే ఆసక్తి పెరుగుతుంది. ఇంటి అందాన్ని ఇనుమడింపజేసే ఆకర్షణీయమైన మార్బుల్స్ ఇప్పుడు అందుబాటులోకి వచ్చేశాయి. అవి ఖాళీగా వేసుకోకుండా వాటిని మనకు నచ్చిన రీతిలో రూపొందించుకోవచ్చు. చూడడానికి కూడా ఇవి ఎంతో అందంగా కన్పిస్తాయి. ఇంటికి వచ్చిన అతిథులను ఇట్టే ఆకట్టుకుంటాయి. ఇంట్లో గది ప్రాముఖ్యాన్ని బట్టి వివిధ శైలుల్లో ఏర్పాటు చేసుకోవచ్చు. వాటి ధరలు మాత్రం పరిమాణం, శైలులను బట్టి ఉంటాయి.

అందమైన ఇన్ లే వర్క్..
ఇంటి నిర్మాణ సమయంలో ఫ్లోరింగ్‌కు రాయి, పలకలు, చెక్క తరచూ ఎంచుకుంటుంటాం. ఫ్లోరింగ్‌కు స్టోన్ మెటీరియల్‌నే అంతా ఇష్టపడతారు. ఈ స్టోన్‌లో మార్బుల్, గ్రానైట్‌లు అందరికీ తెలిసినవే. మార్బుల్ ఫ్లోరింగ్‌లో చాలా తరచుగా వచ్చే ప్యాట్రన్‌ను డిజైన్‌లాగా ఫ్లోరింగ్ వేసుకుంటాం. కానీ అది సాదాగా ఉంటుంది. కాబట్టి దానికి కాస్త క్రియేటివ్ టచ్ ఇస్తూ మార్బుల్స్‌పై నచ్చిన డిజైన్ ప్రింట్ చేసుకోవచ్చు. దీన్నే మార్బుల్ ఇన్‌లే వర్క్ అంటారు. దీంతో ఫ్లోరింగ్, గోడలు, పూజ గదులు.. ఇలా మనకు కావాల్సిన చోట వివిధ రకాల ప్యాట్రన్‌లను రూపొందించుకోవచ్చు. ఇన్‌లే వర్క్‌లో సాధారణమైన డిజైన్లకు చదరపు అడుగుకు రూ.450 నుంచి ధర మొదలవుతుంది. సంక్లిష్టమైన డిజైన్లకైతే అయ్యే ఖర్చు చదరపు అడుగుకు రూ. 2వేల వరకు ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.

Attractive marbles that enhance the beauty of the home

Telangana Latest News

Comments

comments