Home తాజా వార్తలు మార్కెట్‌లోకి ఆడి స్పోర్ట్‌బ్యాక్ కారు!

మార్కెట్‌లోకి ఆడి స్పోర్ట్‌బ్యాక్ కారు!

Audi-S5న్యూఢిల్లీ : జర్మనీ లగ్జరీ కారు తయారీ సంస్థ ఆడి మంగళవారం సరికొత్త ఎస్5 స్పోర్ట్‌బ్యాక్ మోడల్‌ను మార్కెట్లోకి విడుదల చేసింది. దీని విలువ రూ.62.95 లక్షలుగా(ఢిల్లీ ఎక్స్‌షోరూం) నిర్ణయించారు. ఈ కారు టాప్ స్పీడ్ 250 కి.మీ/హెచ్‌గా ఉంది. వినియోగదారులకు ఆశలకు అనుగుణంగా ఈ మోడల్ ఎంతో ఆకర్షణీయంగా రూపొందించామని ఆడి ఇండియా హెడ్ జోయ్ కింగ్ తెలిపారు. సమర్థవంతమైన, స్పోర్టీ, శక్తివంతమైన స్టైల్‌తో ఈ మోడల్‌ను తయారు చేశామని అన్నారు. అలాగే ఇంధన సామర్థంలో రాజీ లేకుండా ఆనందభరితమైన డ్రైవింగ్ అనుభవం కలుగుతుందని ఆయన పేర్కొన్నారు.