Home వార్తలు బాలకృష్ణ కెరీర్‌లోనే ఓ మైలురాయిగా…

బాలకృష్ణ కెరీర్‌లోనే ఓ మైలురాయిగా…

balaiahతెలుగు సినిమా ఇండస్ట్రీలో ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధాని అమరావతిలో తన సినిమా ఆడియో వేడుకను జరిపించిన తొలి హీరో నందమూరి బాలకృష్ణ. తను హీరోగా చేసిన ‘డిక్టేటర్’ ఆడియో ఫంక్షన్‌ను ఆయన అమరావతిలో నిర్వహించారు. ఇప్పుడు బాలకృష్ణ ప్రతిష్టాత్మకమైన తన 100వ చిత్రాన్ని కూడా అమరావతిలో ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నట్టు సమాచారం. ఉగాది పండుగ సందర్భంగా ఏప్రిల్ 8న పూజా కార్యక్రమాలతో మొదలయ్యే ఈ చిత్రం గురించి త్వరలోనే ఓ అధికారిక ప్రకటన వెలువడనుంది. విలక్షణ దర్శకుడు క్రిష్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నాడు. బాలయ్య 100వ చిత్రం ‘గౌతమపుత్ర శాతకర్ణి’ కథ ఆధారంగా తెరకెక్కనుంది. ఈ చిత్రానికి ‘యోధుడు’ అనే టైటిల్‌ను పరిశీలి స్తున్నారు ఫిల్మ్‌మేకర్స్. ప్రస్తు తం క్రిష్ ఈ చిత్రం ప్రీ ప్రొడక్షన్ వర్క్‌లో బిజీగా ఉన్నాడు. హీరో యిన్‌గా నయనతారను తీసుకోవాలని భావిస్తు న్నారు. బాలకృష్ణ కెరీర్‌లోను ఓ మైలురాయిగా నిలిచే ఈ చిత్రం ఓ డిఫరెంట్ పీరియాడిక్ ఫిల్మ్‌గా రూపుది ద్దుకోనుంది. క్రిష్‌కు చెందిన ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టై న్‌మెంట్, సాయి కొర్ర పాటి వారాహి చలన చిత్రం బ్యానర్‌లపై ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. బాలకృష్ణ కెరీ ర్‌లో భారీ బడ్జెట్ చిత్రంగా ఇది నిలవనుంది.