Search
Saturday 22 September 2018
  • :
  • :
Latest News

‘ఎన్‌టిఆర్’ బయోపిక్ లో నటించే అవకాశం..

NTR-BIOPIC

హైదరాబాద్‌: నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం ‘ఎన్‌టిఆర్’ నటిస్తున్న సంగతి తెలిసిందే. క్రిష్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న  ఈ చిత్రంలో బాలకృష్ణ తన తండ్రి పాత్రను పోషిస్తున్నారు.అయితే ఈ సినిమాలో నటించే ఇతర నటీనటులను చిత్రయూనిట్ ఎంపిక చేయాల్సి ఉంది. ఈ నేపథ్యంలో కొత్త నటీనటుల కోసం  చిత్ర యూనిట్  ఆడిషన్లు నిర్వహిస్తున్నారు. ‘నటిస్తూ తెరమీద కనిపిస్తూ జీవించాలనుకునేవాళ్లు చాలా మందుంటారు. కానీ, మంచి అవకాశాలు రానివాళ్లు కొందరు.. ఏది మంచి అవకాశమో అర్థం కాని వాళ్లు కొందరు ఉంటారు. అలాంటివాళ్లందరికీ ఒక అవకాశం ఇవ్వాలనుకుంటున్నాం. ఎస్‌బికె  ఫిల్మ్స్‌ నిర్మాణంలో నందమూరి బాలకృష్ణ నటిస్తున్న ‘ఎన్‌టిఆర్’ బయోపిక్‌లో ప్రాముఖ్యత ఉన్న కొన్ని పాత్రలకు కొత్తవారిని ఆహ్వానిస్తున్నాం. ఆసక్తి ఉన్న అన్ని వయసుల వారు రెండు ఫొటోలు, సెల్‌ఫోన్‌తో మీ పెర్‌ఫార్మెన్స్‌ని షూట్‌ చేసిన రెండు వీడియోలు(30 సెకన్లు) తీసి మాకు మెయిల్‌ పంపండి. దయచేసి ఆఫీస్‌కి రావద్దు. మెయిల్‌ ద్వారానే సమాచారం తెలుసుకుంటాం. మాకు నచ్చిన వారిని ఆడిషన్స్‌కు ఆహ్వానిస్తాం’ అని చిత్రబృందం సోషల్‌మీడియాలో పోస్ట్‌ చేసింది.

NTR

Comments

comments