Home తాజా వార్తలు బౌలింగ్‌లో బుమ్రాను మించిపోయిన ఆసీస్ బుడ్డోడు

బౌలింగ్‌లో బుమ్రాను మించిపోయిన ఆసీస్ బుడ్డోడు

Jasprit Bumrahముంబయి: టీంఇండియా పేసర్ జస్ర్పీత్ బుమ్రా స్పూర్తిగా తీసుకొని ఓ ఆసీస్ బుడ్డోడు అచ్చం అతని లాగే బంతులను వికెట్లకు వేస్తూ ఆకట్టుకుంటున్నాడు. బుమ్రా బౌలింగ్‌‌ను ఆస్ట్రేలియా చిన్నారి ఫాలో అవుతున్నాడు. ప్రస్తుతం ఈ చిన్నారి వేస్తున్న బౌలింగ్  నెట్టింట్లో హల్ చల్ చేస్తుంది. ఆస్ట్రేలియా, భారత్ మధ్య జరిగిన టెస్టు సిరీస్‌లో పేసర్ జస్ప్రీత్ బుమ్రా 21 వికెట్లను తీసి మ్యాచ్‌లో ‘కీ’ రోల్ పోషించిన సంగతి తెలిసిందే. బుమ్రా, హర్షా భోగ్లేను జత చేస్తూ ఆసీస్ అభిమాని ట్వీట్ చేశాడు. భవిష్యత్‌లో ఆస్ట్రేలియా జట్టుకు ఈ చిన్నారిని తీసుకుంటే బాగుంటుందంటూ ఓ అభిమాని ట్వీట్‌లో ప్రశంసల జల్లు కురిపించాడు. ఆసీస్ చిన్నారి బౌలింగ్‌ను బుమ్రా, హర్షా భోగ్లే  అభినందించారు. చిన్నారి బౌలింగ్‌పై ఐసిసి స్పందిస్తూ 2034 సంవత్సరంలో భారత్, ఆస్ట్రేలియా మధ్య జరగనున్న సిరీస్‌ రసవత్తరంగా సాగే అవకాశం ఉందని ట్వీట్ చేసింది.
Aussie kid Emulates Jasprit Bumrah Bowling
https://twitter.com/c_u_r_t_o/status/1082807510967345152