Search
Saturday 22 September 2018
  • :
  • :

టీమిండియా పరాజయం

Team-India-Women

వడోదర: ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా సోమవారం వడోదరలో జరిగిన తొలి వన్డేలో భారత మహిళ జట్టు పరాజయం పాలైంది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 200 పరుగులకే కుప్పకూలింది. కెప్టెన్ మిథాలీ రాజ్ అస్వస్థత కారణంగా మ్యాచ్‌కు దూరం కావడంతో హర్మన్‌ప్రీత్ కెప్టెన్ బాధ్యతలు నిర్వహించింది. భారత బ్యాట్స్‌వుమెన్లలో పూజా వస్త్రాకర్(51), సుష్మా వర్మ(41), పూనమ్ రౌత్(37) మాత్రమే రాణించారు. కెప్టెన్ హర్మన్‌ప్రీత్‌తో సహా మిగతవారందరూ ఘోరంగా విఫలమయ్యారు. అనంతరం 201 పరుగుల స్వల్ప లక్షంతో బరిలోకి దిగిన ఆసీస్‌కు ఓపెనర్ నికోల్ బోల్టన్ అజేయ సెంచరీతో జట్టుకు తిరుగుతేని విజయాన్ని అందించింది. దీంతో ఆస్ట్రేలియా 32.1 ఓవరల్లో కేవలం రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి అలవోక విజయాన్ని అందుకుంది. శతకం నమోదు చేసిన బోల్టన్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచింది.

Australia beat India by eight wickets.

Comments

comments