Search
Wednesday 19 September 2018
  • :
  • :
Latest News

కోడిమాంసంపై ఆసీస్ క్రికెటర్ల గుస్సా

Australia-Team

కోల్‌కతా: టీమిండియాతో ఐదు వన్డేలు, మూడు టీ20లు ఆడేందుకు ఆస్ట్రేలియా జట్టు  భారత్ కు వచ్చిన విషయం తెలిసిందే. దీనిలో భాగంగా రెండో వన్డే(గురువారం) కోసం ఆసీస్ క్రికెటర్లు ఇప్పటికే కోల్‌కతాకు చేరుకున్నారు. అయితే బెంగాల్‌ క్రికెట్‌ సంఘం అధికారులు బుధవారం వడ్డించిన కోడికూర నచ్చలేదని వారు అసంతృప్తి వ్యక్తం చేశారు. మోతాదుకు మించి అతిగా వేడి చేసిన కోడికూర వడ్డించారనేది వారి వాదన.

ముందే చెప్పినట్టు గ్రిల్డ్‌ చికెన్‌ను 73 డిగ్రీ సెంటిగ్రేడ్‌ వద్ద కాకుండా ఎక్కువ వేడి వద్ద తయారు చేయడంతో ఆసీస్ ఆటగాళ్లు అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఇది తెలుసుకున్న అధికారులు విషయం పెద్దది కాకుండా జాగ్రత్త తీసుకున్నారు. ఇంకోసారి ఇలా జరగదని వారిని సముదాయించారు. ఐదు వన్డేల సిరీస్ లో భాగంగా ఇప్పటికే టీమిండియా తొలి వన్డేలో ఘన విజయం సాధించి సిరీస్ 1-0 తేడాతో ముందజలో ఉంది. గురువారం జరిగే రెండో వన్డేలోనూ గెలిచి ఆధిక్యాన్ని మరింతగా పెంచాలనేది భారత్ వ్యూహం. ఇక ఆసీస్ జట్టు కూడా ఈ వన్డేలో గెలిచి బోణి కొట్టాలనే కసితో ఉంది.

Comments

comments